కత్తులతో లాయర్‌‌పై దాడి.. కాపాడబోయిన వారిపైనా అటాక్

V6 Velugu Posted on Jul 19, 2021

  • ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు

ముంబై: మధ్యాహ్నం వేళ.. నడి రోడ్డుపై బిజీ ట్రాఫిక్ మధ్య లాయర్‌‌పై కత్తులు, రాడ్లతో దాడి జరిగింది. దాదాపు 15 మంది ఒక్కసారిగా చుట్టుముట్టి చంపేసేందుకు ప్రయత్నించారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని దహిసర్ వెస్ట్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన లాయర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆస్తి వివాదాలకు సంబంధించిన విషయంలో తేడాలు రావడంతో లాయర్‌‌పై దాడి చేశారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. లాయర్‌‌ను కత్తులు, రాడ్లతో అటాక్ చేస్తుండగా చుట్టుపక్కల ఉన్నవాళ్లు కాపాడే ప్రయత్నం చేస్తుండగా వారిపైనా దాడికి చేశారని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో కొందరు వీడియో తీశారని, దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మొత్తం 15 మంది వరకూ దాడిలో పాల్గొన్నారని, సోమవారం మధ్యాహ్నం వరకూ ముగ్గురిని అరెస్ట్ చేశామని, మిగిలిన వారికోసం గాలింపు జరుగుతోందని పేర్కొన్నారు. అల్లర్లు సృష్టించడం, హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.

Tagged attack, Mumbai, lawyer, property dispute, rods, Swords

Latest Videos

Subscribe Now

More News