తాలిబన్ల దేశంలో మరోమారు భూప్రకంపనలు

తాలిబన్ల దేశంలో మరోమారు భూప్రకంపనలు

ఆఫ్ఘనిస్తాన్‌లో 5.2 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, ఉదయం 7:35 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. అయితే, ఈ ఘటనలో ఇప్పటివరకు ఆస్తి లేదా ప్రాణనష్టం గురించి ఎటువంటి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.

అంతకుముందు అక్టోబర్‌లో, పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో బలమైన భూకంపం సంభవించి వందలాది మంది మరణించినట్లు ఆ దేశ జాతీయ విపత్తు అథారిటీ తెలిపింది. ఈ ఘటనలో దాదాపు 2వేల మందికి పైగా మరణించారు, 9,000 మందికి పైగా గాయపడ్డారు. ఇటీవలి సంవత్సరాలలో భూకంపాలకు గురైన దేశాల్లో ఆప్ఘనిస్తాన్ అత్యంత ఘోరమైన ప్రకంపనలను ఎదుర్కొందని అక్కడి ప్రభుత్వం తెలిపింది.