ఆఫ్రికాలో పడవ బోల్తా..109 మంది జలసమాధి, 116 మంది గల్లంతు

ఆఫ్రికాలో పడవ బోల్తా..109 మంది జలసమాధి, 116 మంది గల్లంతు

ఆఫ్రికాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. జిబుటి నుంచి యెమెన్ కు  వలసదారులతో వెళ్తున్న బోటు బోల్తాపడింది. బాబ్ లె్మండేట్ జలసంధిలో జరిగిన ప్రమాదంలో 15మంది చిన్నారులతో సహా 109 మంది జలసమాధి కాగా, మరో 116 మంది గల్లంతయ్యారని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ తెలిపింది.  బోటు ప్రమాదం నుంచి80 మందికి పైగా ప్రాణాలతో బయటపడ్డారు. బోటు ప్రయాణించేవారంతా ఇథియోపియా జాతీయులుగా గుర్తించారు. 

అక్టోబర్ -9 రాత్రి బాబ్ ఎల్-మండేబ్ జలసంధి మీదుగా జిబూటి నుంచి యెమెన్‌కు సుమారు 350 మందితో బోటు వెళ్తుండగా బాక్‌కు ఉత్తరాన ఉన్న గుహెరే సమీపంలో బోల్తా పడింది. ఆఫ్రికాలో తలెత్తిన సంఘర్షణలతో ప్రమాదం అని తెలిసినా,  ప్రమాదకరమైన రద్దీ ఉన్నప్పటికీ, గల్ఫ్ దేశాలలో పని వెతుక్కుంటూ వలసదారులు వెళ్తున్నారు.  ఇథియోపియా, సోమాలియా నుండి ఆఫ్రికా కొమ్ము ప్రాంతం నుంచి యెమెన్‌కు వెళ్లే మార్గాన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు.

ఇలాంటి బోటు ప్రమాదాలు గతంలో కూడా జరిగాయి.  2025లో యెమెన్‌కు వెళ్లే సముద్ర మార్గంలో 900 మందికి పైగా వలసదారులు మరణించారని అంతర్జాతీయ వలస సంస్థ రిపోర్టులు చెబుతున్నాయి. అలాగే ఈ ప్రయాణానికి ప్రయత్నించేవారి సంఖ్య 18 శాతం పెరిగిందని పేర్కొంది. 2026 మార్చిలో జరిగిన ఓడ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించగా, 45 మంది గల్లంతయ్యారు.

ఆఫ్రికాలో గత కొంతకాలంగా తలెత్తిన సంఘర్షణలతో ప్రజలు గల్ఫ్ దేశాలకు పనులకోసం వలస వెళ్తుంటారు. ప్రమాదకరం అని తెలిసినా హార్న్ ఆఫ్ ఆఫ్రికా నుంచి యెమెన్‌కు వెళ్లే మార్గాన్ని వలసదారులు ఎక్కువగా ఉపయోగిస్తారు.

మిడిల్ ఈస్ట్  అంతటా అస్థిరత పెరుగుతున్నప్పటికీ, పేదరికం, అభద్రత , వాతావరణ మార్పుల పెరుగుతున్న ప్రభావాలు చాలా మందిని ఈ ప్రయాణాన్ని చేపట్టేలా ప్రేరేపిస్తున్నాయి అని ఐఓఎం పేర్కొంది. సెప్టెంబర్ 10 నుంచి ఇప్పటివరకు ఇథియోపియా నుంచి జిబూటికి 20వేల కంటే ఎక్కువ సరిహద్దు దాటారని IOM గుర్తించింది.