లక్షా 25 వేల సంవత్సరాల తర్వాత.. భూమిపై అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

లక్షా 25 వేల సంవత్సరాల తర్వాత.. భూమిపై అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

భూమిపై ఉష్ణోగ్రత పెరుగుతుందని రోజూ అనుకుంటున్నాం కానీ.. అది ఏ స్థాయిలో ఉంటుందో కచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇలాంటి సమయంలోనే కొన్ని నిదర్శనాలు ప్రకృతి మనకు ఇస్తుంది అనేది సుస్పష్టం. అలాంటిదే ఇప్పుడు జరిగింది. లక్షా 25 వేల సంవత్సరాల తర్వాత.. 2023, జూలై 3వ తేదీన.. ప్రపంచం అనే కంటే.. భూమిపై సరాసరి అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావటం.. ప్రపంచ దేశాలను షాక్ కు గురి చేసింది.

సహజంగా భూమిపై సరాసరి అత్యధిక ఉష్ణోగ్రత 16.92 డిగ్రీల టెంపరేచర్ ఇప్పటి వరకు హయ్యస్ట్. జులై 3వ తేదీ మాత్రం 17.01 డిగ్రీలుగా నమోదు అయ్యింది. 2016 ఆగస్ట్ నెల తర్వాత.. జీరో పాయింట్ 8 డిగ్రీలు అధికంగా.. ఉష్ణోగ్రత నమోదు కావటం.. భూమిపై గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని స్పష్టం చేస్తుంది. ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురి చేస్తుంది.

US ప్రభుత్వం యొక్క నేషనల్ సెంటర్స్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ప్రిడిక్షన్ నుంచి వచ్చిన డేటా, వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం, జూలై 3న ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేడి రోజుగా నమోదైంది. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత 17.01 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. ఇది ఆగస్టు 2016లో నమోదైన 16.92 డిగ్రీల మునుపటి రికార్డును బద్దలుకొట్టింది. జూలై 3 నాటి ఉష్ణోగ్రత మానవ కార్యకలాపాల వల్ల 20వ శతాబ్దం చివరిలో సంవత్సరానికి సగటు కంటే 8 డిగ్రీలు ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు నమోదైన రోజుల్లో ఈ రోజే వాతావరణం అత్యంత వేడెక్కిన రోజు.

రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న ఎల్ నినో వాతావరణంతో కలిపి శిలాజ ఇంధనాలు, ఇతర మానవ కార్యకలాపాల వల్ల ఏర్పడిన వాతావరణ మార్పుల ఫలితంగా ప్రపంచ ఉష్ణోగ్రతలో పెరుదల నమోదవుతోంది. రాబోయే వారాల్లో ఈ రికార్డు మళ్లీ బద్దలయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇటీవలి IPCC వెల్లడించిన నివేదికల ప్రకారం (A.2.2), ప్రపంచ ఉష్ణోగ్రతలు 1లక్షా25వేల సంవత్సరాలలో ఇప్పుడున్నంత ఎక్కువగా ఎప్పుడూ లేవు.

మానవ ప్రేరిత వాతావరణ మార్పుల కారణంగా ఈ సారి ఉష్ణోగ్రతలు కనీసం ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నాయని క్లైమేట్ సెంట్రల్ కనుగొంది. ఇక కెనడియన్ చరిత్రలో ఈ సారి ఉష్ణోగ్రతలు అత్యంత ఘోరంగా మారాయి. చైనాలో, 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కాగా... దేశంలోని కొన్ని ప్రాంతాలను భారీ వరదలు వచ్చినా.. వేడిగాలులు మాత్రం కొనసాగాయి. క్లైమేట్ సెంట్రల్ అంచనా ప్రకారం, వాతావరణ మార్పు ఈ ఏడాది కనీసం ఐదు రెట్లు ఎక్కువ వేడిని కలిగించింది. దేశంలో 2023 మొదటి అర్ధ భాగంలో 35 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదై కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇలా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం 1961 తర్వాత ఇదే మొదటిసారి.