గేమ్ చేంజర్ సెట్స్‌‌లోకి రామ్ చరణ్

 గేమ్ చేంజర్ సెట్స్‌‌లోకి రామ్ చరణ్

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘గేమ్ చేంజర్’. కియారా అద్వానీ హీరోయిన్‌‌గా నటిస్తోంది. దిల్ రాజు భారీ బడ్జెట్‌‌తో నిర్మిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌‌‌‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సంక్రాంతికి చిన్న బ్రేక్ తీసుకున్న చరణ్.. రీసెంట్‌‌గా తిరిగి సెట్స్‌‌లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం హైదరాబాద్ ఇండస్ట్రీ ఏరియాలోని కెమికల్ ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతోందని తెలిసింది.  

ఇందులో ఓ యాక్షన్ సీక్వెన్స్‌‌తో పాటు కీలకమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారట. ఈ షెడ్యూల్‌‌లో చరణ్‌‌తో పాటు ఇతర నటీనటులు కూడా పాల్గొంటున్నారు.  ఇందులో రామ్ చరణ్‌‌ డ్యూయెల్ రోల్‌‌లో నటిస్తున్నాడు. అందులో ఒకటి ఐఏఎస్‌‌ ఆఫీసర్‌‌‌‌ పాత్ర కాగా, మరొకటి ప్లాష్‌‌ బ్యాక్ సీన్స్‌‌లో వచ్చే పొలిటీషియన్ పాత్ర అని తెలుస్తోంది.  జ‌‌యరామ్‌‌, అంజ‌‌లి, సునీల్, శ్రీకాంత్‌‌, న‌‌వీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. సెప్టెంబర్‌‌‌‌లో సినిమా రిలీజ్ చేయనున్నారు.  

మరోవైపు ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్‌‌లో ఓ సినిమా చేయాల్సి ఉంది రామ్ చరణ్. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌‌ను మార్చి నుంచి మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారట.  కోస్తా బ్యాక్‌‌డ్రాప్‌‌లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న  ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.