
న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోందని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు. రాష్ట్రంలో రోజురోజుకీ క్రైమ్ ఘటనలు పెరుగుతున్నాయని ఆమె మండిపడ్డారు. ఘజియాబాద్‌లో 35 ఏళ్ల విక్రమ్ జోషి అనే జర్నలిస్ట్‌పై కొందరు గన్స్‌తో దాడికి పాల్పడిన నేపథ్యంలో యూపీ సర్కార్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం పొద్దున జోషి చనిపోయాడు. రామ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి గూండా రాజ్యాన్ని చేశారని యూపీ సర్కారును విపక్ష నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు.
తాజాగా మాయావతి కూడా యోగి ప్రభుత్వంపై విరమ్శలకు దిగారు. ‘ఉత్తర్‌ప్రదేశ్‌లో మర్డర్‌లు పెరిగిపోయాయి. మహిళలకు సెక్యూరిటీ లేదు. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం కచ్చితంగా దృష్టి పెట్టాలి’ అని మండిపడ్డారు. మోటార్ సైకిల్‌పై తన ఇద్దరు కూతుళ్లతో వెళ్తున్న విక్రమ్ జోషిపై ఓ గ్యాంగ్ దాడికి దిగింది. గ్యాంగ్‌లోని ఒకరు విక్రమ్‌ను చాలా దగ్గర్నుంచి తలపై షూట్ చేశాడు.