జాగ్రత్త! ఆ ఫేమస్ రెస్టారెంట్ చికెన్ కబాబ్స్ సేఫ్ కాదు...

జాగ్రత్త!  ఆ ఫేమస్ రెస్టారెంట్ చికెన్ కబాబ్స్ సేఫ్  కాదు...

చికన్ అనగానే కొందరికి నోరూరుతుంటుంది. నాన్ వెజ్ ప్రియుల గురించి ఇంకా చెప్పనక్కరలేదు. అయితే మనం తినే ఫుడ్ ఎంత ఆరోగ్యమైదో ఎప్పుడైనా ఆలోచించారా... ఫెమస్ రెస్టారెంట్ అంటూ క్యూలో నిలబడి మరి కొంటుంటాం, మరి అలాంటప్పుడు ఈ రెస్టారెంట్లో ఇచ్చే చికన్  ఐటమ్స్ మనుషులకి ప్రమాదకరం అని తేలితే ఏం చేస్తారు... 

బెంగళూరులోని గాంధీనగర్‌లో ఇదే జరిగింది. బెంగళూరులో ప్రముఖ రెస్టారెంట్ అయిన ఎంపైర్ రెస్టారెంట్ పై స్టేట్ ఫుడ్ లాబొరేటరీ, పబ్లిక్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్ చేసిన ల్యాబ్  రిపోర్ట్ ప్రకారం ఇందులో తయారు చేసే చికెన్ కబాబ్‌లు మనుషులు తినడానికి సురక్షితం కాదని ప్రకటించింది. 

వివరాలు చూస్తే  జూన్ 27న బెంగళూరులోని ఆనంద్ రావు సర్కిల్ దగ్గరలో ఉన్న ఎంపైర్ రెస్టారెంట్ నుండి 2 కిలోల చికెన్ కబాబ్ సాంపుల్స్  అంటే ఒక్కొక్కటి 500 గ్రాముల నాలుగు ప్యాకెట్లను సేకరించిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అంబరీష్ గౌడ తనిఖీల తర్వాత ఆహార భద్రత గురించి  ఆందోళను మొదలయ్యాయి.

 అయితే సాంపుల్స్  టెస్టింగ్ కోసం పంపించాక  జూలై 11న వచ్చిన  రిపోర్టులో చికెన్ కబాబ్‌లు ఆహార ఉత్పత్తి ప్రమాణాల నిబంధనలు 2011 కింద పేర్కొన్న అవసరమైన భద్రతా ప్రమాణాలను అందుకోలేదని తేలింది. దింతో ఆహార భద్రత & ప్రమాణాల చట్టం 2006 ప్రకారం ఎంపైర్ రెస్టారెంట్  చికెన్ కబాబ్‌లు సురక్షితం కాదని తేలింది.

ALSO READ | భారీ లగేజీలతో రైలు ఎక్కుతున్నారా.. 40 కేజీలు దాటితే డబ్బులు కట్టాలి.. ఎయిర్ పోర్ట్ తరహాలో బాదుడే బాదుడు

దింతో BBMP ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (నార్త్ జోన్) ఎంపైర్ రెస్టారెంట్‌కు నోటీసు జారీ చేసింది, అలాగే దీనిపై సమాధానం ఇవ్వాలని  30 రోజుల టైం ఇచ్చింది. మరోవైపు మైసూరులోని CFTRIలో ఫుడ్ సాంపుల్స్  తిరిగి టెస్టింగ్ కోసం కోరొచ్చని కానీ స్వంత ఖర్చుతో మాత్రమే అని రెస్టారెంట్‌కు తెలిపింది. 

FSSAI జారీ చేసిన నోటీసు మాకు అందింది. ఈ సమస్య పై మేము ఇప్పుడేం మాట్లాడలేము, మా కబాబ్‌లలో ఫుడ్ కలరింగ్ వాడటం మానేశామని నేను ఖచ్చితంగా చెప్పగలను అని ఎంపైర్ చైన్ ఆఫ్ రెస్టారెంట్ల CEO షకీర్‌ అన్నారు.