వాషింగ్టన్ : కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. దీని దెబ్బకు సగం మంది జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. గతంలో ఎప్పుడూ ఎదురుకాని సమస్యలతో పరేషాన్ అవుతున్నారు. కానీ ఇదే కరోనా ప్రపంచానికి చాలా విషయాల్లో కొత్త పాఠాలు కూడా నేర్పింది. ఇప్పటికే కరోనా తో సమాజంలో వచ్చిన మంచి మార్పులను సోషల్ మీడియాలో వైరస్ చేస్తున్నారు. కచ్చితంగా కరోనా ఎఫెక్ట్ తగ్గి లాక్ డౌన్ ముగిశాక కొత్త ప్రపంచాన్ని చూస్తామని ఎక్స్ ఫర్ట్స్ చెబుతున్నారు. పర్సనల్ క్లీన్ నెస్, హ్యూమాన్ రిలేషన్స్, ఫిజికల్ డిస్టెన్స్, నో షేక్ హ్యాండ్స్, వర్క్ ప్లేస్ లో ఎక్కువ మంది గుమిగూడకుండా ఉండటం, అనవసర మీటింగ్ ఇలా చాలా విషయాల్లో ఊహించని మార్పులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా షేక్ హ్యాండ్స్ అనే విధానం 90 శాతం తగ్గిపోతుందని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) మాజీ డైరెక్టర్ టామ్ ఫ్రీడెన్ చెప్పారు. ఆఫీస్ లలో చాలా చేంజేస్ చేయవచ్చని కరోనా ద్వారా తెలిసిందని చెప్పారు. “ఆఫీస్ లలో చేతితో తీసే డోర్ అవసరమా అనేది ఆలోచించాలి. అనవసర మీటింగ్ ల అవసరం లేకుండా కూడా పనులు జరుగుతాయని తెలిసింది. సిక్ లీవ్ లను ఎంప్లాయిస్ వాడుకున్న సమస్య లేదని తెలిసింది. అందువల్ల ఆఫీస్ లలో చేంజేస్ పై దృష్టిపెట్టాలి” అని అన్నారు. ఒకరికొకరు తాకటం ఉండదు, శానిటైజర్ల వాడకం సాధారణం అవుతుంది. కంప్యూటర్లు, ఫోన్లను షేర్ చేసుకోరని లాక్ డౌన్ తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పు ఉంటుందని సోషల్ ఎక్స్ ఫర్ట్స్ అంచనా వేస్తున్నారు.
కరోనా తర్వాత లైఫ్ చేంజ్
కరోనా తర్వాత కచ్చితంగా లైఫ్ మునుపటిలా ఉండదని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఎపిడమాలజిస్ట్ బ్రాండెన్ బ్రోన్ చెప్పారు. పర్సనల్ క్లీన్ నెస్, ఫిజికల్ డిస్టెన్స్ అనేది ప్రతి ఒక్కరికీ అలవాటుగా మారుతుందన్నారు. మాస్క్ ల వాడకాన్ని అన్ని ఆఫీస్ లు ఎంకరేజ్ చేస్తాయన్నారు. సూపర్ మార్కెట్లు ఇప్పటికే ఎక్కువ సంఖ్యలో జనాన్ని అనుమతించటం లేదు. ఫ్యూచర్ లో అన్ని మాల్స్, షాప్స్ లో సోషల్ డిస్టెన్స్ కొనసాగుతుందని చెబుతున్నారు. కరోనా కారణంగా వచ్చిన మంచి మార్పులతో ఆఫీస్ లలో మీటింగ్ లు తగ్గుతాయని భావిస్తున్నాని ఫ్రైడెన్ అనే ఎంప్లాయ్ చెప్పారు. సిక్ లీవ్ లను కచ్చితంగా వాడుకోమని కంపెనీలే ఉద్యోగులను కోరుతాయని భావిస్తున్నానని ఆయన అన్నారు.
