Good News : మళ్లీ ప్యాసింజర్ రైళ్లు.. ఇకపై ఆర్డినరీ చార్జీలు

Good News : మళ్లీ ప్యాసింజర్ రైళ్లు.. ఇకపై ఆర్డినరీ చార్జీలు

ఢిల్లీ: రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది.  'ఎక్స్‌ప్రెస్ స్పెషల్స్' లేదా 'మెము/డెము ఎక్స్‌ప్రెస్' రైళ్లుగా పేరు మార్చిన 'ప్యాసింజర్ రైళ్ల'కి సెకండ్ క్లాస్ ఆర్డినరీ చార్జీలను రైల్వేశాఖ పునరుద్ధరించింది. సవరించిన చార్జీలు ఇవాళ తెల్లవారు జాము నుంచి అమల్లోకి వచ్చాయి. కోవిడ్‌ మహమ్మారి లాక్‌డౌన్ తర్వాత రైల్వేలు వాటి పేర్లను మార్చడం ద్వారా 'ప్యాసింజర్ రైళ్ల'ను క్రమంగా నిలిపివేసింది. 'ఆర్డినరీ క్లాస్' ఛార్జీలను తీసేసి ఎక్స్‌ప్రెస్ రైలు చార్జీలతో సమానంగా కనీస టిక్కెట్ ధరను రూ.10 నుంచి రూ.30కి పెంచిన విషయం తెలిసిందే. వాటిని సవరిస్తూ మార్పులు చేసింది.