త్రిసూర్: కేంద్ర పెట్రోలియం, సహజవాయువు , పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి త్రిసూర్ లోని లూర్దు కేథడ్రల్ చర్చికి బంగారు జమపాల సమర్పించారు. అనంతరం సురేష్ గోపి చర్చిలో ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా చర్చిలో నండియాల్ పదున్ను దైవమే పాటను ప్రదర్శించారు. అయితే గతంలో కూడా సురేష్ గోపి మేరీమాతకు బంగారు కిరీటం సమర్పించారు. దీనిపై కాంగ్రెస్ నేత పోస్టులో వివాదం కూడా తలెత్తింది
ఇటీల లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నటుడు సురేష్ గోపి చర్చికి వెళ్లి మేరీమాతకు బంగారు కిరీటం సమర్పించారు. జనవరి 15న సురేష్ గోపి తన కుటుంబం తోకలిసి చర్చిని సందర్శించి పులికొట్టిల్ , ట్రస్టీ సభ్యులు డాల్సన్ డేవిస్ పెల్లిస్సేరి సమక్షంలో మేరీ మాతకు 500 గ్రాముల కంటే ఎక్కువ బరువున్న కిరీటాన్ని సమ ర్పించారు. గుర్వయూర్ లో తన కుమార్తె వివాహానికి ఒకరోజు ముందు గోపి కిరీటాన్ని సమర్పించారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అనిల్ అక్కర తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేయడంతో ఇది వివాదం తలెత్తింది. అది బంగారు కిరీటం కాదని.. రాగికి బంగారు తాపడం చేశారని అనిల్ అక్కర ఆరోపిస్తూ..సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
లోక్ సభ ఎన్నికల్లో త్రిసూర్ లోక్ సభ స్థానం నుంచి 74వేల 686 ఓట్ల భారీ మెజార్టీతో సురేష్ గోపి చారిత్రాత్మక విజయం సొంతం చేసుకున్నారు. ఉత్కంఠ పోరులో సీపీఐ నేత వీఎస్ సునిల్ కుమార్ పై విజయం సాధించారు. గోపికీ మొత్తం 4లక్షల 12లేవ 338 ఓట్లు రాగా, సునీల్ కుమార్ 3లక్షల 37వేల 652 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి మురళీధరన్ 3 లక్షల 28వేల 124 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.