
మార్నింగ్ వాక్ ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న విషయం తెలిసిందే. రిజల్ట్ మరింత ఎఫెక్టివ్‌గా ఉండాలంటే మార్నింగ్ వాక్ తర్వాత తినే ఫుడ్ కూడా కరెక్ట్‌గా ఉండాలి.
మార్నింగ్ వాక్ తరువాత ఎనర్జీ కోసం అరటిపండ్లు తినాలి. దీనివల్ల శరీరానికి సరిపడా కేలరీలు అందుతాయి.
- జాగింగ్, వాకింగ్.. తర్వాత పుచ్చకాయ తిన్నా ఆరోగ్యానికి మంచిదే. వీటిల్లో ఉండే సిట్రులిన్, లైకోపిన్ బాడీని రిలాక్స్ చేస్తాయి. శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరిగేలా చూస్తాయి. సిట్రులిన్ నైట్రిక్ ఆక్సైడ్‌ని విడుదల చేసి ఎక్సర్సైజ్ తర్వాత కలిగే అలసటని తగ్గిస్తుంది.
- మార్నింగ్ వాక్ తర్వాత ప్రొటీన్స్ ఎక్కువగా ఉండే చాక్లెట్ మిల్క్ షేక్ కూడా తాగొచ్చు. త్వరగా జీర్ణం అవుతుంది. ఇది వర్కవుట్ తర్వాత అలిసిపోయిన కండరాల్ని యాక్టివ్ చేస్తుంది.
- విటమిన్స్, మినరల్స్, ప్రొటీన్స్, హెల్దీ ఫ్యాట్స్ ఉన్న ఆమ్లెట్‌ని మార్నింగ్ వాక్ తర్వాత తినొచ్చు. ఇది వెయిట్ లాస్కి మంచి మెడిసిన్.
- బాడీకి బూస్టింగ్ ఇవ్వాలంటే అమైనో యాసిడ్స్ ఎక్కువగా ఉన్న ప్రొటీన్ షేక్స్ తాగాలి.
- వాకింగ్ తర్వాత చికెన్ తింటే కండరాలకు మంచిది. అది కూడా కూరగాయలు, ఆకుకూరలతో తింటే మరింత హెల్దీ.
- ప్రొటీన్, క్యాల్షియం, సోడియం ఎక్కువగా ఉండే కాటేజ్ చీజ్‌ని వాకింగ్ తర్వాత తీసుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫ్రూట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.