
వినాయక చవితి పర్వదినం సందర్భంగా టాలీవుడ్‌లో ఒక సంతోషకరమైన వార్త బయటకు వచ్చింది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల , ప్రఖ్యాత నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి (SVC LLP) మరోసారి చేతులు కలుపుతున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ ప్రకటన ఇప్పుడు వైరల్ అవుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో బ్లాక్ బస్టర్ మూవీ రాబోతోందని సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
'కుబేరా' బ్రేక్ ఈవెన్ కాకపోయినా..
ఈ కొత్త ప్రాజెక్ట్ ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ బ్యానర్ నిర్మించిన ఇటీవలి చిత్రం 'కుబేరా'. ఇందులో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలు పోషించారు. దాదాపు రూ.130 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధించినప్పటికీ, తమిళనాడు, కర్ణాటక, విదేశీ మార్కెట్‌లలో ఆశించిన విజయం సాధించలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ అదే దర్శకుడితో సినిమా ప్రకటించడం వారిద్దరి మధ్య ఉన్న పరస్పర విశ్వాసాన్ని చాటి చెబుతోంది.
ఈ కొత్త ప్రాజెక్ట్ శేఖర్ కమ్ముల కెరీర్‌లో 11వ చిత్రంగా నిలవనుంది. 'ఆనంద్', 'గోదావరి', 'హ్యాపీ డేస్' వంటి క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించి ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు. ఆయన సినిమాల్లోని సహజమైన భావోద్వేగాలు, సున్నితమైన కథనాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ కొత్త ప్రాజెక్ట్‌లోనూ అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
►ALSO READ | Vijay Devarakonda: OTTలోకి 'కింగ్డమ్'.. కానీ ఆ సీన్లు లేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి!
ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్ దశలో ఉందని, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని SVC LLP ప్రకటించింది. ఈ రోజు ( ఆగస్టు 27వ తేదీన) SVC LLP వ్యవస్థాపకులలో ఒకరైన సునీల్ నారంగ్ పుట్టినరోజు , అదే విధంగా వినాయక చవితి కూడా కావడం విశేషం. ఇది ఈ ప్రాజెక్ట్‌కు ఒక శుభారంభమని చెప్పవచ్చని అభిమానులు అభిప్రాయపడుతున్నారు .
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ✨ pic.twitter.com/dalYNk5984
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) August 27, 2025