మరో 6 రోజుల్లో వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌.. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ ఫుల్‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌

మరో 6 రోజుల్లో వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌.. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ ఫుల్‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌: లాంగ్‌‌‌‌‌‌‌‌ జర్నీ తర్వాత హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ గడ్డపై అడుగుపెట్టిన పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ జట్టు గురువారం ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టింది. దాదాపు మూడు గంటల పాటు ఉప్పల్‌‌‌‌‌‌‌‌ స్టేడియం నెట్స్‌‌‌‌‌‌‌‌లో తీవ్రంగా శ్రమించింది. ఆప్షనల్‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ కావడంతో ఇద్దరు రిజర్వ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లతో కలిపి 10 మంది ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్నారు. స్టేడియంలో వామప్‌‌‌‌‌‌‌‌ తర్వాత బాబర్‌‌‌‌‌‌‌‌ ఆజమ్‌‌‌‌‌‌‌‌, ఇఫ్తికార్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌ నెట్స్‌‌‌‌‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ చేశారు. వీళ్లకు షాహిన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్రిది, హారిస్‌‌‌‌‌‌‌‌ రవూఫ్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ వేశారు. హసన్‌‌‌‌‌‌‌‌ అలీ కూడా ఇందులో పాల్గొన్నాడు. ఈ సెషన్‌‌‌‌‌‌‌‌ను బౌలింగ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ మోర్నీ మోర్కెల్‌‌‌‌‌‌‌‌ పర్యవేక్షించాడు. హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ ఏర్పాటు చేసిన అండర్‌‌‌‌‌‌‌‌–19 బౌలర్‌‌‌‌‌‌‌‌ ఆరడగుల నిషాంత్‌‌‌‌‌‌‌‌ సరన్‌‌‌‌‌‌‌‌ ట్రెయినింగ్‌‌‌‌‌‌‌‌లో ప్రత్యేకంగా కనిపించాడు. 

అతనితో పాటు మిగతా బౌలర్లతో జోకులు వేస్తూ పాక్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్లు సరదాగా గడిపారు. భాగ్యనగరంలోనే ఉన్న న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌లో పాల్గొనలేదు. అయితే డారిల్‌‌‌‌‌‌‌‌ మిచెల్‌‌‌‌‌‌‌‌, మార్క్‌‌‌‌‌‌‌‌ చాప్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ మాత్రం స్టేడియానికి వచ్చారు. ఇక మెగా ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో పాల్గొనే 10 జట్లకు నిర్వాహకులు బీఫ్‌‌‌‌‌‌‌‌ను అందుబాటులో ఉంచడం లేదు. దీంతో పాక్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్లు తమ రోజువారి ప్రోటీన్‌‌‌‌‌‌‌‌ కోసం చికెన్‌‌‌‌‌‌‌‌, మటన్‌‌‌‌‌‌‌‌, చేపలపై ఆధారపడుతున్నారు. డైట్‌‌‌‌‌‌‌‌ చార్ట్‌‌‌‌‌‌‌‌లో గ్రిల్డ్‌‌‌‌‌‌‌‌ ల్యాంప్స్‌‌‌‌‌‌‌‌, మటన్‌‌‌‌‌‌‌‌ కర్రీ, బటర్‌‌‌‌‌‌‌‌ చికెన్‌‌‌‌‌‌‌‌, గ్రిల్డ్‌‌‌‌‌‌‌‌ ఫిష్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. కార్బోహైడ్రేట్స్‌‌‌‌‌‌‌‌ కోసం ఆవిరిలో ఉడికించిన బాస్మతి బియ్యం, స్పాగెట్టి బోలోగ్నిస్‌‌‌‌‌‌‌‌ సాస్‌‌‌‌‌‌‌‌ను తీసుకున్నారు. లెజెండ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ షేన్‌‌‌‌‌‌‌‌ వార్న్‌‌‌‌‌‌‌‌కు పులావ్‌‌‌‌‌‌‌‌తో పాటు ఇది చాలా 

ఇష్టమైన ఫుడ్‌‌‌‌‌‌‌‌. 

దాదాపు రెండు వారాల పాటు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోనే ఉండనున్న పాక్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్లు చీట్‌‌‌‌‌‌‌‌ మీల్స్‌‌‌‌‌‌‌‌లో భాగంగా ప్రఖ్యాత హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ బిర్యానీని రుచి చూసే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. పాక్‌‌‌‌‌‌‌‌, న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ టీమ్స్‌‌‌‌‌‌‌‌కు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అశ్విక దళంలో భాగంగా ఆరు పోలీసు వ్యాన్లతో కూడిన స్క్వాడ్ టీమ్స్‌‌‌‌‌‌‌‌ వెంట వచ్చాయి.