పాకిస్థాన్ పై మోడీ ట్వీట్..థ్యాంక్స్ చెప్పిన పీఎం

పాకిస్థాన్ పై మోడీ ట్వీట్..థ్యాంక్స్ చెప్పిన పీఎం

ఇస్లామాబాద్: కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదల ధాటికి అతలాకుతలమైన పాకిస్తాన్ కు సంఘీభావం తెలిపినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్​ బుధవారం థ్యాంక్స్ చెప్పారు. పాక్ లో వరదల వల్ల 1,100కు పైగా మంది చనిపోగా, 33 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. పాకిస్తాన్ కు భారీ ప్రాణ, ఆస్తి నష్టం కలగడంపై విచారం వ్యక్తం చేస్తూ ఇటీవల ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

వరద మృతులకు సంతాపం తెలియజేశారు. దీనిపై పాక్ ప్రధాని బుధవారం స్పందిస్తూ మోడీకి ధన్యవాదాలు చెప్తూ ట్వీట్ చేశారు. కాగా, వరదల బారిన పడటంతో తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇండియా నుంచి ఆహార దిగుమతులు చేసుకునేందుకు కంపెనీలకు అనుమతివ్వాలని పాక్ ప్రభుత్వం యోచిస్తోంది. అందుకు అక్కడి ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.