పెట్రో మోత.. హైదరాబాద్ లో రూ.101 దాటిన పెట్రోల్

పెట్రో మోత.. హైదరాబాద్ లో రూ.101 దాటిన పెట్రోల్

దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్ల మోత మోగుతోంది. ఇవాళ కుడూ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 30 పైసలు, డీజిల్ పై 31 పైసలు పెంచాయి ఆయిల్ కంపెనీలు. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 101 రూపాయల 4 పైసలకు పెరిగింది. డీజిల్ 95 రూపాయల 89 పైసలకు చేరింది. ఏపీలోనూ ధరలు దంచుతున్నాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ 102 రూపాయల 98 పైసలు, డీజిల్  97 రూపాయల 26 పైసలకు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 97 రూపాయల 22 పైసలు... ఆర్థిక రాజధాని ముంబైలో 103 రూపాయల 36 పైసలకు పెరిగింది. 

ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ రేట్లు సెంచరీ కొట్టేశాయి. తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కల్ కత్తా, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ లో పెట్రోల్ రేట్లు వందదాటి పరుగులు పెడుతున్నాయి. రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ లో అత్యధికంగా లీటర్ పెట్రోల్ 108 రూపాయల 37 పైసలకు పెరిగింది. డీజిల్ 101 రూపాయల 12 పైసలకు చేరింది. గతనెలలో 16 సార్లు పెరిగిన రేట్లు......ఈనెలలో ఇప్పటికే 12 సార్లు పెరిగాయి. పోయిన నెలలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి పెట్రోల్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి.