
హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేండ్లలో చిన్నారిపై రేప్ చేసి, చంపేసిన రాజు.. పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఈ రోజు ఉదయం రాజు డెడ్‌బాడీ దొరికిన విషయం తెలిసిందే. అతడి సూసైడ్‌తో ఆ చిన్నారి ఆత్మకు శాంతి చేకూరుతుందని పల్లా అన్నారు. అయితే టీఆర్‌ఎస్ ప్రభుత్వం పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని, అందుకే రాష్ట్రంలో క్రైం రేట్ తక్కువగానే ఉందని ఆయన చెప్పారు. అక్కడక్కడా నేరాలు జరిగినా పోలీసులు ఉక్కు పాదంతో అణచివేస్తున్నారని పల్లా అన్నారు.