Health tips:వితౌట్ మెడిసిన్ మైగ్రేన్నుంచి రిలీఫ్..ఇంటి చిట్కాలు మీకోసం..

Health tips:వితౌట్ మెడిసిన్ మైగ్రేన్నుంచి రిలీఫ్..ఇంటి చిట్కాలు మీకోసం..

ప్రస్తుత బిజీ లైఫ్ లో మనం ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం చేస్తుంటాం. పని ఒత్తిడి కారణంగా అలసట, తలనొప్పి వంటివి వస్తుంటాయి. ఇవి సాధారణమే అనుకుంటుంటాం. తరుచుగా తలనొప్పి వస్తుందంటే అంత తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే అవి మైగ్రేన్ లక్షణాలు కావొచ్చు. మైగ్రేన్ రోజువారీ పనుల్లో ఇబ్బందులను కలిగిస్తుంది. కొన్ని కొన్ని సార్లు మైగ్రేన్ నొప్పి పెరుగుతూ విశ్రాంతి లేకుండా చేస్తుంది. మీరు మైగ్రేన్ తో బాధపడుతున్నట్లయితే ఈ ఆర్టికల్ మీకోసమే.. కేవలం నివారించడం ద్వారా మైగ్రేన్ నొప్పిని ఎలా వదిలించుకోవాలో వివరిస్తుంది. 

మైగ్రేన్ నుంచి బయటపడాలంటే తరుచుగా మందులను వాడుతుంటాం. ఇవి నొప్పిని తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తాయి.. కానీ ఆరోగ్యానికి చాలా హానికరం.అందువల్ల మందులు లేకుండా మైగ్రేన్ నొప్పి నుంచి బయటపడేందుకు కొన్ని ఇంటి చిట్కాలు. 

దాల్చిన చెక్క 

మైగ్రేన్ నుంచి త్వరగా రిలీఫ్ పొందాలంటే దాల్చినచెక్క ఓ మంచి ఔషధం. 2 టీ స్పూన్ల దాల్చిన చెక్క పొడిని నీటిలో కలుపుకొని తలకు పట్టించి 15 నుంచి 20 నిమిషాలు ఉంచాలి.ఇది క్రమంగా నొప్పినుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

దేశీ ఆవు నెయ్యి

ఆవు దేశీ నెయ్యిని మైగ్రేన్‌కు దివ్యౌషధంగా భావిస్తారు. నొప్పి వచ్చినప్పుడల్లా ఆహారంలో ఆవు నెయ్యిని కలపడం లేదా ముక్కులో 2 చుక్కలు వేయడం వల్ల త్వరగా ఉపశమనం లభిస్తుంది.

నిమ్మ తొక్కలు

నొప్పి ఉన్న సమయంలో నిమ్మ తొక్కను పేస్ట్ లా చేసి తలకు రాసుకుంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి ,యాంటీఆక్సిడెంట్లు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.

కర్పూరం,దేశీ నెయ్యి

తలనొప్పిగా ఉన్నప్పుడు కర్పూరం రుబ్బి అందులో దేశీ నెయ్యి కలపండి. ఆ తర్వాత చేతులతో బాధాకరమైన ప్రదేశంలో స్మూత్ గా మసాజ్ చేయాలి. కర్పూరం చల్లని ప్రభావం నొప్పిని త్వరగా తగ్గిస్తుంది.

పెరుగుతున్న బీజీ లైఫ్ లో మందులకన్నా ఇలాంటి ఇంటి నివారణ చిట్కాలు, పద్దతులను వాడటం ద్వారా మైగ్రేన్ తగ్గించుకోవచ్చు. 

►ALSO READ | Sunday Special: చికెన్​ తో చిల్​.. చిల్​ .. వెరైటీ రెసిపీ .. ఇలా తయారుచేసుకోండి..