ఆర్మీలో మరో 11 మంది  మహిళలకు పర్మనెంట్​ కమిషన్‌‌‌‌‌‌

ఆర్మీలో మరో 11 మంది  మహిళలకు పర్మనెంట్​ కమిషన్‌‌‌‌‌‌
  • సుప్రీం వార్నింగ్​తో ఆర్మీ నిర్ణయం

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు హెచ్చరిక తర్వాత మహిళలకు భారత సైన్యంలో పర్మనెంట్ కమిషన్‌‌‌‌‌‌‌‌ అందించడానికి ఆర్మీ ఒప్పుకుంది. అన్ని అర్హతలు ఉన్నా పర్మనెంట్ కమిషన్ కోసం తమ అప్లికేషన్లను తిరస్కరించారని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించిన 11 మంది మహిళలకు పర్మనెంట్ కమిషన్‌‌‌‌‌‌‌‌ను మంజూరు చేస్తామని శుక్రవారం ఆర్మీ ఆఫీసర్లు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇదే విషయంపై గతంలో తీర్పు ఇచ్చినప్పటికీ అమలు చేయడంలో విఫలమైనందుకు కోర్టు ధిక్కారం కింద పరిగణిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. దీంతో మహిళా అధికారుల విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని ఆర్మీ కోర్టుకు తెలిపింది. మహిళా ఆఫీసర్లకు పర్మనెంట్ కమిషన్ మంజూరు ప్రక్రియను నవంబర్ 26లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.