
‘టైటానిక్’ సినిమా పేరు చెప్పగానే కేట్ విన్‌స్లెట్ గుర్తొస్తుంది. అందమైన ప్రేమకథలో మరెంతో అందమైన ఆమె రూపాన్ని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. తాను కూడా ఆ సినిమాని మర్చిపోలేను అంటోంది కేట్. అయితే అది తనకు పేరు తెచ్చినందుకు కాదు.. ఆ సినిమా వల్ల తాను పడిన కష్టాలకు. నిజం.. ‘టైటానిక్’ మూవీ తర్వాత జరిగినదంతా ఓ పీడకల అంటూ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది కేట్. ‘అప్పటికి నేనింకా యాక్టింగ్ నేర్చుకుంటున్నా. ఉన్నట్టుండి చాలా పేరొచ్చేసింది. అంత పాపులారిటీని ఊహించని నేను ఉక్కిరిబిక్కిరయ్యాను. కానీ అంతకు మించిన బాధతో కుంగిపోయాను. మీడియా కళ్లన్నీ నామీదే. నేనేం చేసినా స్క్రూటినీ చేసేవారు. తమకెలా నచ్చితే అలా జడ్జ్ చేసేవారు. ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా టార్గెట్ చేసేవారు. అది చాలా కష్టంగా ఉండేది’ అంటూ బాధపడింది కేట్. ఆ మాటలు తనని చాలా బాధ పెట్టాయట. తనకసలు ఫేమ్ వద్దే వద్దని అనుకుందట. ఇప్పటికీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసెయ్యాలని అనుకోవట్లేదని, అంత బాధ్యత తాను మోయలేనేమోననే భయం ఇప్పటికీ తనను వెంటాడుతోందని అంటోంది కేట్. ఆమె ఏడుసార్లు ఆస్కార్‌కి నామినేట్ అయ్యి, ఒకసారి ఆస్కార్‌ను అందుకుంది కూడా. అంత గొప్ప నటి అయ్యుండి కూడా ఇప్పటికీ ఇలా మాట్లాడుతోందంటే ఎంత బాధపడి ఉంటుందో!
ఇవి కూడా చదవండి
జడ్చర్ల నుంచి జపాన్ వరకు..
రక్తంలో పుట్టగొడుగులు మొలిచినయ్
పిల్లలను అద్దెకు తీసుకుని పెళ్లిళ్లకు వచ్చి ఏం చేస్తారంటే..