ప్రేమలో ఒట్టు వేస్తున్నారా.. తొందర పడొద్దు..

ప్రేమలో ఒట్టు వేస్తున్నారా.. తొందర పడొద్దు..

ఇష్టం, ప్రేమతోనే ఏరిలేషన్షిప్ అయినా మొదలవుతుంది. అయితే ఆ బంధం ఎక్కువ రోజులు నిలబడాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో పాటు ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే... ఏ అనుబంధానికి అయినా నమ్మకమే పునాది. అయితే ఇద్దరిలో ఒకరు మనసు నొచ్చుకుంటుంది. మరికొందరేమో గొప్పలకు పోయి సాధ్యమవుతాయా? కావా? అనేది కూడా ఆలోచించకుండా పెద్ద ప్రామిస్లు చేస్తారు. పదే పదే ఇలానే జరుగుతుంటే అవతలివాళ్లకు నమ్మకం పోతుంది. అందుకని మాట నిలబెట్టుకోకపోవడం, అబద్ధాలు చెప్పడం మాట ఇచ్చేముందు వల్ల ఆ నమ్మకం బ్రేక్ అవుతుంది. దాంతో ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ, చనువు తగ్గిపోతాయి. అందుకని నమ్మకాన్ని బ్రేక్ చేసే విషయాలు ఏంటో తెలుసుకోవాలి. దాంతో అలాంటి పొరపాట్ల కారణంగా అనుబంధాల మధ్య దూరం పెరగకుండా జాగ్రత్తపడొచ్చు అంటోంది సైకోథెరపిస్ట్ ఎమిలీ సాండర్స్.

'ఈసారి ఇంటర్వ్యూమిస్ కాను', 'చెడు మానేస్తాను'.... ఇలా చాలా ప్రామిస్ లు చేస్తారు. కానీ, అవేమీ నిలబెట్టుకోరు. దాంతో అవతలివాళ్లకు నమ్మకం పోతుంది. అందుకని మాట ఇచ్చే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. సాధ్యమయ్యే ప్రామిస్ లనే చేయాలి.

• ఇద్దరూ ఉన్నప్పుడు సరదాగా మాట్లాడుకోవడం, జోక్స్ వేస్తూ నవ్వుకోవడం మంచిదే. అయితే ఆ జోక్స్ వెటకారంగా ఉండొద్దు. ఏదైనా జోక్ అవతలి వాళ్లకు నచ్చకుంటే అంతటితో ఆపేయాలి. అంతే కాదు ఎదుటి వాళ్లను తక్కువ చేసి మాట్లాడొద్దు. అలాచేస్తే రిలేషన్ షిప్ దెబ్బతింటుంది.

• ఇద్దరి మధ్య సీక్రెట్స్ ఉండొద్దు. ముఖ్యంగా డబ్బుల విషయం ఇద్దరికీ తెలియాలి. డబ్బులు దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారు? ఏమేం కొంటున్నారు? అనేది ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలి. దాంతో "నువ్వు అనవసరంగా ఖర్చు చేస్తున్నావు?" 'నాకు తెలియకుండా డబ్బు ఖర్చు చేస్తున్నావు?' అంటూ గొడవపడకుండా ఉంటారు.

• చాలా సందర్భాల్లో 'చిన్న విషయయే కదా!" అని అబద్ధాలు చెప్తుంటారు. కొంతమంది. ఒకసారి అబద్ధాలు చెప్పడం మొదలు పెడితే అది అలవాటుగా మారుతుంది. దాంతో తమను మోసం చేస్తున్నారని అవతలివాళ్లు అనుకుంటారు. ఇకపై ఏం చెప్పినా నమ్మరు. అందుకని ఎప్పుడూ. నిజమే చెప్పాలి.

• పార్టనర్ కి ఏం అవసరమో, వాళ్ల ఇష్టాలు ఏంటో తెలుసుకోవాలి. వాళ్లు 'ఫలానావి కావాలి' అని అప్పుడు వెంటనే కాకపోయినా తర్వాత అయినా కొనివ్వాలి. అలాకాకుండా వాళ్లు ఏ ఎందుకు? వద్దు' అని అంటే తమ ఇష్టాల్ని గుర్తించడం లేదని అనుకుంటారు. అవతలివాళ్లు. దాంతో ఇద్దరి మధ్య అనుబంధం బలహీనపడుతుంది.