
ఘజియాబాద్: దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువవుతున్నాయి. రీసెంట్‌గా వైట్ ఫంగస్ కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇది చాలదన్నట్లు తాజాగా ఎల్లో ఫంగస్ కేసు కూడా బయటపడింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉండే ఓ వ్యక్తికి ఎల్లో ఫంగస్ సోకింది. డాక్టర్ బ్రిజ్ పాల్ త్యాగీ ఆస్పత్రిలో అతడికి చికిత్సను అందిస్తున్నారు. బ్లాక్, వైట్ ఫంగస్ కంటే ఎల్లో ఫంగస్ మరింత ప్రమాదకరమని సమాచారం. బద్దకం, బరువు తగ్గడం, ఆకలి లేమి లాంటివన్నీ ఎల్లో ఫంగస్ లక్షణాలని తెలుస్తోంది. అనారోగ్యకర లక్షణాల వల్ల కూడా ఎల్లో ఫంగస్ వస్తుందని తెలిసింది. శరీరంలో అంతర్గతంగా వచ్చే ఫంగస్ ఇదని.. లక్షణాలను గుర్తించిన వెంటనే పేషెంట్‌కు ట్రీట్‌మెంట్ అందించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.