
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మళ్లీ క్షీణించిందని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్ తెలిపింది. ఆయనకు ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకినట్లు వైద్యులు తెలిపారు. ప్రణబ్ వెంటిలేటర్ సపోర్ట్ తోనే శ్వాస తీసుకుంటున్నారు. కొంతమంది ప్రత్యేక వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంది.
కాగా.. ఈ రోజు ఉదయం ప్రణబ్ ఆరోగ్యం నిలకడగానే ఉందంటూ ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీట్ చేశారు. వైద్యుల కృషి మరియు ఆయన కోలుకోవాలంటూ కార్యకర్తలు చేసిన ప్రార్ధనల వల్ల ఆయన ఆరోగ్యం కుదుటపడుతుందని అభిజిత్ ట్వీట్ లో తెలిపారు. మధ్యాహ్నానికే ప్రణబ్ ఆరోగ్యం మళ్లీ విషమించడంతో ఆయన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
For More News..