పంచతంత్ర కథలో పులి.. చంద్రబాబు .. సెటైర్లు వేసిన జగన్

పంచతంత్ర కథలో పులి.. చంద్రబాబు .. సెటైర్లు వేసిన జగన్

మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు పాత డైలాగులు చెపుతున్నారని నార్పల సభలో విరుచుకుపడ్డారు.  పులి కథ చెప్పి బాబుపై సెటైర్లు వేశారు జగన్​.  నిత్యం రాజకీయాల మధ్య బతుకున్నామంటూ.. నరమాంసం తినే పులి మారిందంటే నమ్ముతారా అని ప్రశ్నించారు.  వచ్చీ రాని ఇంగ్లీషుతో జాతీయ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చిన చంద్రబాబు...  దోచుకో.. తినుకో..దాచుకో అనే సిద్దాంతాన్ని అవలంభిస్తున్నారన్నారు.  పంచతంత్ర కథలో ముసలి పులిగా చంద్రబాబును పోల్చారు జగన్​ . చంపి దోచుకున్న నగా నట్రాను పులి జనానికి ఎరవేసిందని నార్పల సభలో చంద్రబాబును ఘాటుగా విమర్శించారు.  పులి వచ్చిన వాళ్లను వచ్చినట్టు తినడం నేర్చుకొని... అబద్దాలతో చంద్రబాబు ఇండస్ట్రీని నిర్మించుకున్నారని విమర్శల వర్షం కురిపించారు. రైతులను నట్టేట ముంచి గతంలో అధికారంలోకి వచ్చార్నారు. 2016 నుంచి జీరో వడ్డీ ఎత్తేసిన చంద్రబాబు .. మళ్లీ అబద్దాలతో వస్తే జనం నమ్మాలా అని ప్రశ్నించారు.  


పంచతంత్ర కథల్లో నీతి నేర్చుకుంటాం. రోజూ రాజకీయాల మధ్య మనం బతుకున్నాం.  చంద్రబాబు అధికారంలోకి వచ్చి రైతుల్ని నండా ముంచారు. అక్కాచెల్లెమ్మల పొదుపు రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని బ్యాంకులు వేలం వేశాయప్పుడు. సున్నా వడ్డ పథకాన్ని రద్దు చేశాడు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి.. మొండి చేయి చూపాడు.  ఇప్పుడు మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు ప్రజల్లోకి వస్తున్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు మరిన్ని అబద్ధాలు చెబుతాడు. దోచుకో, పంచుకో.. ఇదే చంద్రబాబు సిద్ధాంతం.  బాబు అబద్ధాలను, మోసాలను నమ్మకండి. జగనన్న వల్ల మంచి జరిగిందా? లేదా? అనేది కొలమానంగా తీసుకోండి.. ఆలోచించండి. మీ జగనన్న నమ్ముకున్నది దేవుడి దయను, ప్రజలను. నా నమ్మకం, నా ఆత్మ విశ్వాసం ప్రజలే అని సీఎం జగన్‌ ఉద్ఘాటించారు. రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో మీ దీవెనలు నాకు కావాలని జగన్​  ప్రజలను కోరారు.