దూకుడుగానే మార్కెట్లు 

దూకుడుగానే మార్కెట్లు 

పాజిటివ్​గా ఫలితాలు, బడ్జెట్‌ అంచనాలు
ఈ వారమే ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ రిజల్ట్స్​
స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ల ఔట్‌పెర్ఫార్మెన్స్‌ కొనసాగుతుంది
సానుకూల ప్రభావాన్ని చూపనున్న టాప్‌ కంపెనీల ఫలితాలు

న్యూఢిల్లీ: డిసెంబర్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌లో కార్పొరేట్‌‌‌‌ కంపెనీలు లాభాలు పుంజుకోవడంతో పాటు, బడ్జెట్‌‌‌‌ ముందుండడంతో ఇండియన్‌‌‌‌ ఈక్విటీ మార్కెట్లు గత వారం రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి. ఈ వారం కూడా మార్కెట్లు అదేవిధంగా కదులుతాయని విశ్లేషకులు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లు ప్రీమియం వాల్యుయేషన్‌‌‌‌తో ట్రేడవుతున్నాయని అందువలన మార్కెట్లు కన్సాలిడేట్‌‌‌‌ అయ్యే అవకాశం కూడా ఉందని వివరించారు. గత వారం బీఎస్‌‌‌‌ఈ సెన్సెక్స్‌‌‌‌, నిఫ్టీ 0.8 శాతం లాభపడ్డాయి. బీఎస్ఈ స్మాల్‌‌‌‌, మిడ్‌‌‌‌ క్యాప్‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌లు 4 శాతం పైన ర్యాలీ చేశాయి. ఈ వారం కూడా బ్రాడర్‌‌‌‌‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌లు అంతే చురుగ్గా కదులుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏజీఆర్‌‌‌‌‌‌‌‌ బకాయిలుపై సుప్రీం తీర్పు, క్యూ3లో ఇండస్‌‌‌‌ఇండ్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ ఎన్‌‌‌‌పీఏలు పెరగడంతో బ్యాంక్‌‌‌‌ షేర్లు గత వారం అధికంగా నష్టపోయాయి. అందువలన ఈ వారం కూడా బ్యాంక్‌‌‌‌ షేర్లు అనిశ్చితిలో కదలాడొచ్చని విశ్లేషకులు అన్నారు. గత వారాంతంలో రిలయన్స్‌‌‌‌ ఇండస్ట్రీస్‌‌‌‌, టీసీఎస్‌‌‌‌, హెచ్‌‌‌‌సీఎల్‌‌‌‌ టెక్నాలజీస్‌‌‌‌, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌ వాటి క్యూ3 ఫలితాలను ప్రకటించాయి. ఈ ఫలితాల ప్రభావం సోమవారం ట్రేడింగ్‌‌‌‌లో కనిపించనుంది. ఈ  కంపెనీలు నిఫ్టీ 50 లో 30 శాతం మార్కెట్‌‌‌‌ క్యాపిటలైజేషన్‌‌‌‌ కలిగి ఉన్నాయి.

రూరల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ షేర్లు లాభాల్లో ?

మరికొన్ని రోజుల్లో బడ్జెట్‌‌‌‌ ప్రవేశపెడుతుండటం, క్యూ3 ఫలితాల సీజన్ కొనసాగుతుండడం వంటి అంశాల వలన ఈ వారం  మార్కెట్‌‌‌‌లో  నిర్దిష్ట స్టాకులు, సెక్టార్లు పాజిటివ్‌‌‌‌ ఉండొచ్చని విశ్లేషకులు తెలిపారు. మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతుందని, కానీ ఇండెక్స్​లు ధర పరంగా మరింత ముందుకెళతాయని శామ్‌‌‌‌కో సెక్యురిటీస్‌‌‌‌  ఫౌండర్‌‌‌‌‌‌‌‌, సీఈఓ జిమిత్‌‌‌‌ మోడీ అన్నారు.  ప్రి బడ్జెట్‌‌‌‌ వార్తలు వస్తుండడంతో  నిర్దుష్ట సెక్టార్లు మార్కెట్లను ఔట్‌‌‌‌ పెర్ఫార్మెన్స్‌‌‌‌ చేస్తాయని, ఫలితంగా బీఎస్‌‌‌‌ఈ మిడ్‌‌‌‌, స్మాల్‌‌‌‌ క్యాప్‌‌‌‌ షేర్లు చురుకుదనాన్ని ట్రేడింగ్‌‌‌‌బెల్‌‌‌‌ సీనియర్‌‌‌‌‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌ సంతోష్‌‌‌‌ మీనా అన్నారు. బడ్జెట్‌‌‌‌లో  రూరల్‌‌‌‌, ఇన్ఫ్రా స్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌కు ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందనే అంచనాలుండడంతో, బడ్జెట్‌‌‌‌ ముందు ఈ సెక్టార్‌‌‌‌‌‌‌‌ షేర్లు లాభపడే అవకాశం ఉందన్నారు. లో బేస్‌‌‌‌ కారణంగా నిఫ్టీ 50 ఇండెక్స్‌‌‌‌ లాభం ఏడాది ప్రాతిపదికన 20 శాతం వృద్ధి చేందుతుందని  జియోజిత్‌‌‌‌ ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌‌‌ రీసెర్చ్ హెడ్‌‌‌‌ వినోద్‌‌‌‌ నాయర్‌‌‌‌‌‌‌‌ అన్నారు.  ట్యాక్స్‌‌‌‌ రేటు తగ్గడం వలన కార్పొరేట్ లాభాలు పెరిగాయని, ఫలితంగా ఆర్థిక సంవత్సరం 20, 21 కి గాను కంపెనీల లాభాలు మెరుగుపడతాయని అన్నారు.

టాప్‌‌‌‌ కంపెనీల ఫలితాలు ఈ వారమే..

ఈ వారం అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్‌‌‌‌లు  ఐసీఐసీఐ బ్యాంక్(జనవరి 25), యాక్సిస్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌(జనవరి 22)  ఫలితాలున్నాయి. దీంతో పాటు ఇంజనీరింగ్‌‌‌‌ దిగ్గజం ఎల్‌‌‌‌ అండ్‌‌‌‌ టీ(జనవరి 22), ఇన్యూరెన్స్‌‌‌‌ కంపెనీలు ఐసీఐసీఐ ప్రుడెన్సియల్‌‌‌‌ లైఫ్‌‌‌‌(జనవరి 21), ఎస్‌‌‌‌బీఐ లైఫ్‌‌‌‌(జనవరి 22), హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ లైఫ్‌‌‌‌(జనవరి 23) కూడా ఈ వారం తమ ఫలితాలను ప్రకటించనున్నాయి.  ఎస్సార్‌‌‌‌‌‌‌‌ స్టీల్‌‌‌‌ అప్పులు రికవరీ కావడంతో ఐసీఐసీఐ బ్యాంక్ ఫలితాలు బాగుండే అవకాశం ఉంది.  బ్యాంకు లాభం మూడింతలు పెరుగుతుందని మార్కెట్‌‌‌‌ వర్గాలు అంచనావేస్తున్నాయి.  బ్యాంకు ప్రొవిజన్లు తగ్గడంతో ఏడాది ప్రాతిపదికన 50–60‌‌‌‌‌‌‌‌ శాతం లాభాన్ని యాక్సిస్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌  ప్రకటిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎల్‌‌‌‌ అండ్‌‌‌‌ టీ రెవెన్యూ గ్రోత్‌‌‌‌ పెరుగుతందని అంచనాలున్నాయి. ఈ కంపెనీలతో పాటు కోటక్‌‌‌‌ మహింద్రా, కెనరా బ్యాంక్‌‌‌‌ , బ్యాంక్ ఆఫ్‌‌‌‌ బరోడా,  ఏసియన్‌‌‌‌ పెయింట్స్‌‌‌‌, అల్ట్రాటెక్ సిమెంట్‌‌‌‌ వాటి ఫలితాలను ప్రకటించనున్నాయి.

see also: ప్లీజ్‌‌‌‌ ..ఓటేసి పోండి..ఊరెళ్లిన ఓటర్లకు క్యాండిడేట్ల అభ్యర్థన