అగ్నివీర్ వాయు మ్యూజిషియన్ పోస్టులకు నోటిఫికేషన్

అగ్నివీర్  వాయు మ్యూజిషియన్ పోస్టులకు నోటిఫికేషన్

నిజామాబాద్, వెలుగు : ఇండియన్​ ఎయిర్​ ఫోర్స్​లో అగ్నివీర్​ వాయు మ్యూజిషియన్​ పోస్టుల అపాయింట్​మెంట్​కు నోటిఫికేషన్​ వెలువడిందని కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు తెలిపారు.  టెన్త్​ పాసై, 2 జనవరి 2004 నుంచి 2 జులై 2007లోపు పుట్టిన పెండ్లి కాని యూత్​ దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పియానో, గిటార్​, వయోలిన్​, శాక్సోఫోన్​, తబలా తదితర వాయిద్య పరికరాలలో ఒకదానిపై ప్రావీణ్యం ఉన్న వారు అర్హులని అన్నారు.

అర్హతగల అభ్యర్థులు జూన్​ 5 లోపు https://agnipathvayu.cdac.in/ ద్వారా అన్​లైన్​ అప్లికేషన్​ సమర్పించాక ఆన్​లైన్​లోనే టెంపరరీ అడ్మిట్​ కార్డు జారీ అవుతుందన్నారు. అందులో రిక్రూట్​మెంట్​ ర్యాలీకి చెందిన ప్రదేశం, డేట్​, టైం వివరాలు ఉంటాయన్నారు. ఈ అడ్మిట్​కార్డుతో వెళ్తేనే  ర్యాలీ అటెండ్​ కావడానికి అనుమతిస్తారన్నారు.