ఆవు పాలతో ఆరోగ్యం.. ఆయన ఎందరికో ఆదర్శం

ఆవు పాలతో ఆరోగ్యం.. ఆయన ఎందరికో ఆదర్శం

ఎంతో మందిని విద్యావంతులుగా తీర్చిదిద్దా డు. అనేక వ్యాపారాలు చేశాడు. కోట్లు సంపాదించాడు.
విలాసవంతమైన జీవితం. అయినా ఏదో తెలియని వెలితి.ఆయనకు వ్యవసాయం అంటే ఇష్టం. అందుకే
సాగు బాటపట్టి లాభాలు పండిస్తున్నాడు. ఒకప్పుడు పిల్లలకు పాఠాలు నేర్పిన ఆయన ఇప్పుడు ఆవు పాల
విశిష్టతపై పెద్దలకు పాఠాలు నేర్పుతున్నాడు. దేశీ ఆవు పేడతో అగర్ బత్తీలు, షాంపూ, పండ్ల పొడి తయారు
చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు సిరిసిల్లకు చెందిన నాగేందర్ రెడ్డి.

రాజన్నసిరిసిల్ల, వెలుగు సిరిసిల్లకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పల్లెటూరు నేరెళ్ల. ఆ ఊరిశివారులో పదెకరాల వ్యవసాయ క్షేత్రం..అందులో చిన్న రేకుల షెడ్డులో భార్యతో కలిసి ఉంటున్నాడు నాగేందర్ రెడ్డి. 1980లోసిరిసిల్లలో వివేకవర్ధిని విద్యా సంస్థను ఏర్పాటుచేసిన ఆయన వేలాది మంది విద్యార్థులకుచదువు చెప్పాడు. పెద్ద బంగ్లాలు, లగ్జరీ కార్లు ఉన్నా అవేవి ఆయనకు తృప్తిని ఇవ్వలేదు.అందుకే పదేళ్ల క్రితం వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. వ్యవసాయంతోపాటుగోశాల ఏర్పాటు చేసి అంతరిం చిపోతున్నదేశీయ ఆవులను పెంచుతున్నాడు . అంతేకాదు ఆవుపాల విశిష్టతను ప్రజలకు చెప్తున్నాడు .సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ,వర్మీ కంపోస్టు ఎరువును కూడా తయారుచేస్తున్నాడు.

గోశాల..

దేశీయ ఆవులను సంరక్షించడానికి ఆవుపాల శ్రేష్టతను, ఆరోగ్య రహస్యాలు అందరికీతెపిపేందుకు పదేళ్ల క్రితమే గోశాలను ఏర్పాటు చేశాడు. అందులో గుజరాత్నుంచి తీసుకొచ్చిన గిర్ జాతి ఆవులనుపెంచుతున్నాడు. లీటర్ పాలను అరవై రూపాయలకు అమ్ముతున్నాడు. ప్రతి రోజూ 50 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి.ఈ గోశాల వల్ల 10 మందికి ఉపాధి దొరుకుతోంది. గోశాలలోని ఆవుల వ్యర్థాలతో కూడా కొన్ని వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాడు నాగేందర్ రెడ్డి. ఆవు పేడతో అగర్ బత్తీలు,గోమూత్రంతో ఔషధాలు, షాంపూ, పండ్ల పొడి తయారు చేస్తున్నాడు . గోమూత్రాన్ని డబ్బాల్లో ప్యాక్ చేసి మార్కెట్ లో అమ్ముతున్నాడు .

ఆధ్యాత్మిక కేంద్రం..

నేరెళ్ల వ్యవసాయ క్షేత్రంలో గోపాలకృష్ణ చైతన్య ఆశ్రమం పేరిట ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్నిఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి సిరిసిల్ల నుంచే కాకుండా చాలా ప్రాంతాల నుంచి కృష్ణభక్తులు, గో ప్రేమికులు వస్తుంటారు. అందులోయోగా తరగతులు, ఆధ్యాత్మిక కార్యక్రమాలునిర్వహిస్తారు.

ఆరోగ్యవంతమైన సమాజం కోసమే..

కేవలం డబ్బు సంపాదించడంకోసమే ఈ వ్యవసాయ క్షేత్రాన్నిఏర్పాటు చేయలేదు. అంతరిం చిపోతున్న ఆవులను సంరక్షించడమేకాకుండా ఆవు పాల విశిష్టతను,సేంద్రియ పంటల ప్రాముఖ్యాన్నిఅందరికీ తెలిపేందుకే కృషిచేస్తున్నా. పచ్చని వాతావరణంలోఉంటే చాలా తృప్తిగా ఉంటుంది.ముపురము, గంగడోలు వంటిజాతుల ఆవుల పాలు ఎంతోశ్రేష్టమైనవి అని అందరూతెలుసుకోవాలి. ప్రస్తుతం అన్నిడెయిరీల్లో ఎక్కువగా గేదె, జెర్సీపాలే దొరుకుతున్నాయి. ఈపాలు తాగడం వల్ల కొవ్వు శాతంపెరగడమే కాకుండా మధుమేహం,గుండె సంబంధిత వ్యాధులువస్తాయి. దేశీ ఆవుల పాలల్లో ఏ2ప్రొటీన్ ఉంటుంది. అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శ్వేత విప్లవం పేరుతో సంకర జాతి ఆవులనుసృష్టించి పాల ఉత్పత్తి పెం చారేతప్ప వాటి వల్ల ఆరోగ్యానికి కలిగేనష్టాలను గుర్తించలేక పోయారు.అంతేకాకుండా ఈజీగా పంటపండాలి అని రసాయన ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు.దాంతో అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నట్లు అవుతుంది.