
ఎడతెరిపి లేకుండా వానలు పడుతుండడంతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. గతంలోనే దుక్కి దున్నుకున్న రైతులు ఇప్పుడు నాట్లు వేసేందుకు పొలాలను రెడీ చేసి పెట్టుకున్నారు. రెండు రోజులుగా ఓ వైపు చిరుజల్లులు కురుస్తుండగానే.. మరో వైపు కూలీలు నాటు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు