
డిచ్పల్లి, వెలుగు: నిజామాబాద్ జిల్లాకు అగ్రికల్చర్ డిగ్రీ కాలేజీ మంజూరు చేయడం హర్షనీయమని తెలంగాణ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి సంఘం అధ్యక్షుడు పుప్పాల రవి పేర్కొన్నారు. బుధవారం క్యాంపస్ లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. అగ్రికల్చర్ కాలేజీ మంజూరుతో జిల్లా ప్రజల దశాబ్దాల కోరిక నెరవేరిందన్నారు. కాలేజీ మంజూరుకు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్నాయకుల కృషిచేశారన్నారు. జిల్లావాసుల కలను సాకారం చేసిన సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ఎస్ యూఐ వర్సిటీ ప్రెసిడెంట్కొమిరె శ్రీశైలం, లీడర్లు రాజేందర్, లక్ష్మణ్, వినయ్, భాస్కర్, బాలాజీ, ఇలియాస్పాల్గొన్నారు.