రైతులు డ్రమ్​సీడర్​ను ఉపయోగించుకోవాలి: అధికారి శ్రీజ

రైతులు డ్రమ్​సీడర్​ను  ఉపయోగించుకోవాలి: అధికారి శ్రీజ

చిన్నచింతకుంట, వెలుగు: డ్రమ్​ సీడర్ తో వరి విత్తనాలను విత్తుకుంటే రైతులకు లాభాలు ఉంటాయని మండల వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీజ తెలిపారు. చిన్నచింతకుంట మండలంలోని అప్పంపల్లి గ్రామంలో రైతు పొలంలోకి వెళ్ళి డ్రైమ్ సీడర్ తో విత్తనాలు వేయించారు. డ్రైమ్ సీడర్ తో రైతులు విత్తనాలు వేయిస్తే కూలీల ఖర్చు తగ్గుతుందని, పంట అధిక దిగుబడి వస్తుందని అన్నారు. నాటువేసిన రైతుల కన్న ముందు డ్రమ్ సీడర్ తో విత్తుకుంటే 20 రోజుల ముందుగానే పంట చేతికి వస్తుందని , చీడపీడల బాధ కూడా తగ్గుతుందని ఆమె రైతులకు అవగాహన కల్పించారు.