ప్రజా సమస్యలు పరిష్కరించాలి : మంత్రి శ్రీహరి

ప్రజా సమస్యలు పరిష్కరించాలి : మంత్రి శ్రీహరి

మక్తల్, వెలుగు : ప్రజా సమస్యలను పరిష్కరించాలని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం మక్తల్​పట్టణంలోని వార్డుల్లో మంత్రి బైక్​పై తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వార్డుల్లో చేపట్టాల్సిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పలు అభివృద్ధి పనులపై అధికారులకు వివరించారు. వార్డులో తిరుగుతున్న మంత్రిని మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలను ఆప్యాయంగా పలకరించారు.

 నూతనంగా నిర్మిస్తున్న 150 పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణంలో పలు వార్డుల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకే వార్డుల్లో పర్యటించినట్లు తెలిపారు. త్వరలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అనంతరం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో పీవీ ఫొటోకు మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.