ఒక్కో కుటుంబానికి రూ.16వేల 500 జమ చేస్తున్నాం : మంత్రి తుమ్మల

ఒక్కో కుటుంబానికి రూ.16వేల 500 జమ చేస్తున్నాం : మంత్రి తుమ్మల

ఖమ్మం జిల్లా: గత వంద సంవత్సరాలుగా ఎన్నడూ లేని బీభత్సాన్ని ఖమ్మం ఎదుర్కోవాల్సి వచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. ఆగస్ట్ 31న వచ్చిన వరద కారణంగా ఖమ్మం జిల్లాకు భారీగా నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. మున్నేరు వరదల వల్ల నష్ట పోయిన ప్రతీ కుటుంబానికి తక్షణ సాయం కింద రూ.16వేల 500 వారి అకౌంట్లో జమ చేస్తామని తెలిపారు. అకస్మాతుగా వచ్చిన వరదలు కావున మొదటి రోజు ఏలాంటి చర్యలు చేపట్టలేకపోయాం. కానీ.. మూడు రోజుల్లో సాధారణ స్థితికి తీసుకువచ్చామన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడారు. 

వరదలు వచ్చిన తర్వాత రోజు నుంచి రెస్క్యూ చేసుకుంటూనే, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇండ్లు శుభ్రం చేసుకోవడానికి ఫైర్ సిబ్బంది పని మరువలేనిదని, వాటర్ ట్యాంకర్లు, జేసిబి లను,ట్రాక్టర్లను ఉపయోగించి శానిటైజేషన్ చేశాము. రిలీఫ్ క్యాంపులను సెప్టెంబర్ 10 వరకు కొనసాగిస్తూనే ఉన్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్లు మంజూరు చేసింది. అన్ని శాఖల అంచనాల మేరకు రూ.730 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిసిందన్నారు. కుసుమంచి, సింగరేణి, ఎర్రుపాలెం ప్రాంతాల్లో జిల్లా వ్యాప్తంగా మృతి చెందిన 6 గురికి రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా అందించాం. 

ఫాల్ట్రీ పరిశ్రమలో బాగా నష్టం జరిగింది. రూ.15 వేలకు పైగా ఇండ్లు ధ్వంసం అయ్యాయి. తాత్కాలికంగా ఆర్ అండ్ బి రూ.6కోట్లతో రిపేయిర్ చేస్తున్నామని మంత్రి ప్రకటించారు. బుధవారం రేపు సెంట్రల్ టీం ఖమ్మం ప్రాంతంలో పర్యటించడానికి వస్తోందని ఆయన చెప్పారు. జరిగిన నష్టాన్ని రేపు కేంద్ర కమిటీ దృష్టికి తీసుకొని వెళ్తామన్నారు. శాశ్వత పరిష్కారాన్ని రూ.434 కోట్లు అవసరమని వివరించారు. వరి పంట 35వేల ఎకరాల్లో నష్టం జరిగింది. పంట నష్ట పరిహారం కింద ఎకరానికి రూ.10 వేలు ప్రభుత్వం తరుపున ఇస్తామన్నారు. రూ.730 కోట్లు నష్టం వాటిల్లినట్లు కేంద్రానికి తెలియజేయనున్నామని మీడియా సమావేశంలో తెలిపారు.