రోహ్‌తక్: అత్యాచారం, హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్ బాబా పెరోల్ కోసం అప్లై చేసుకున్నారు. హర్యానాలోని సిర్సా ఆశ్రమంలో వ్యవసాయం చేసుకునేందుకు తనకు పెరోల్ ఇవ్వాలని డేరా బాబా కోరినట్లు అధికారులు చెప్పారు. ఈ మేరకు జైలు సూపరింటెండెంట్ జిల్లా ఉన్నతాధికారులకు లేఖ రాశారు.
డేరా బాబాను పెరోల్‌పై రిలీజ్ చేయొచ్చా లేదా అనే అంశాన్ని పరిశీలించాలని కోరారు. జైల్లో డేరాబాబా సత్‌ప్రవర్తనతో ఉన్నారని, ఎవరికి ఇబ్బంది కలిగించలేదని రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఈ మేరకు సిర్సా పోలీసులు రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని, ఆయనకు ఎంత భూమి ఉంది అనే దానిపై ఎంక్వైరీ చేస్తున్నారని సిర్సా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేశ్ కుమార్ చెప్పారు.
