అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసు: 38 మందికి ఉరి శిక్ష

అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసు: 38 మందికి ఉరి శిక్ష

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ స్పెషల్ కోర్టు 38 మందికి ఉరిశిక్ష విధించింది. సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో ఇప్పటికే 49 మందిని దోషులుగా తేల్చిన కోర్టు.. వారికి ఇవాళ శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో 38 మందికి ఉరిశిక్ష విధించగా.. మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2008 జూలై 26న గంట వ్యవధిలోనే అహ్మదాబాద్ సిటీలోని 21 చోట్ల వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో సుమారు 56 మంది చనిపోగా... 200 మందికి పైగా గాయాలపాలయ్యారు. నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియాకి చెందిన ఉగ్రసంస్థ ఇండియన్ ముజాహిదీన్ తో సంబంధం ఉన్న వాళ్లే ఈ పేలుళ్లకు పాల్పడ్డారని నిఘా సంస్థలు తేల్చాయి. 2002 గోద్రా అల్లర్లకు ప్రతీకారంగానే ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడ్డారని తెలిపాయి. ఈ కేసులో మొత్తం 77 మంది నిందితులను గుజరాత్ స్పెషల్ కోర్టు విచారించింది. వీరిలో 49 మందిని దోషులుగా నిర్ధారించగా... సరైన సాక్ష్యాలు లేవని మరో 28 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

మరిన్ని వార్తల కోసం..

బల్మూరిపై గాడిద దొంగతనం కేసు.. అర్ధరాత్రి అరెస్ట్

సున్నిపిండి స్నానంతో కలిగే బెనిఫిట్స్ ఇవే..

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు