దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా తగ్గాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 25 వేల 920 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ముందు రోజుతో పోలిస్తే... 4 వేల 837 కేసులు తక్కువగా నమోదయ్యాయి. అలాగే గడిచిన 24 గంటల్లో 492 మంది కొవిడ్ తో చనిపోయినట్లు తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. కరోనాతో మరో 66 వేల 254 మంది కోలుకోగా... ప్రస్తుతం 2 లక్షల 92 వేల 92 యాక్టివ్ కేసులున్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 2.07 శాతానికి తగ్గింది. కరోనాతో ఇప్పటివరకు 4 కోట్ల 19 లక్షల 77 వేల 238 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 174.64 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది కేంద్రం.

మరిన్ని వార్తల కోసం..

సున్నిపిండి స్నానంతో కలిగే బెనిఫిట్స్ ఇవే..

మేడారం జాతర ఫోటో గ్యాలరీ

అదనపు పన్నులతో భక్తులను దోచుకుంటున్న ప్రభుత్వం