డబుల్ బెడ్రూం ఇండ్లలో వసతుల్లేవ్

డబుల్ బెడ్రూం ఇండ్లలో వసతుల్లేవ్
  • జీహెచ్ఎంసీ ఎదుట అహ్మద్ గూడ వాసుల ఆందోళన

హైదరాబాద్ సిటీ, వెలుగు: డబుల్ బెడ్రూం ఇండ్లలో వసతులు కల్పించాలని సోమవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసు ముందు  అహ్మద్​గూడ నివాసితులు ఆందోళనకు దిగారు. బస్తీ దవాఖానా ఏర్పాటు చేయడంతో పాటు రవాణా సౌకర్యం కల్పించాలని, లిఫ్టులు రిపేర్లు చేయించాలని డిమాండ్​చేశారు. మంచినీటి సౌకర్యం కల్పించాలని, ఒక్కోసారి మురుగునీరు వస్తోందని వాపోయారు. ఇండ్లకు సంబంధించి పెచ్చులూడుతున్నాయని, ఇండ్లలో ఉండేందుకు భయంగా ఉందన్నారు. 

అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలు కురుస్తుండడంతో దోమల బెడద తీవ్రమైందని, రాత్రిళ్లు నిద్ర కూడా పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.