మగధీర, రగడ, రచ్చ, వకీల్ సాబ్ లాంటి చిత్రాల్లో విలన్గా నటించిన దేవ్ గిల్... ఇప్పుడు హీరోగా, నిర్మాతగా ఓ సినిమా తీస్తున్నాడు. శుక్రవారం పుణెలోని పింప్రి చించ్వాడ్లో జరిగిన ఈవెంట్లో ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ‘అహో విక్రమార్క’ అనే టైటిల్ను ఫైనల్ చేశారు.
దిక్కులు చూడకు రామయ్య, జువ్వ లాంటి చిత్రాలు తీసిన రాజమౌళి అసోసియేట్ త్రికోటి దీనికి దర్శకుడు. వీరత్వం, త్యాగం, భాష, సంస్కృతులు లాంటి అంశాలతో దీన్ని తెరకెక్కిస్తున్నామని త్రికోటి చెప్పారు. మహారాష్ట్ర పోలీసుల ధైర్యాన్ని, అంకితభావాన్ని చూపించేలా ఉంటుందని హీరో, నిర్మాత దేవ్ గిల్ అన్నాడు. షాయాజీ షిండే, ప్రవీణ్ తార్డే, తేజస్విని పండిట్, చిత్ర శుక్లా, ప్రభాకర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.