విలన్ హీరోగా మారితే ..పేట త్రికోటి

విలన్ హీరోగా మారితే ..పేట త్రికోటి

‘మగధీర’ సహా పలు తెలుగు చిత్రాల్లో విలన్‌‌‌‌‌‌‌‌గా నటించిన దేవ్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అహో విక్రమార్క’.  రాజమౌళి దగ్గర పలు చిత్రాలకు కో డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా పని చేసిన పేట త్రికోటి దీనికి దర్శకుడు.  దేవ్ గిల్ సొంత నిర్మాణ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 30న విడుదలవుతోంది.  ఈ సందర్భంగా త్రికోటి మాట్లాడుతూ ‘దిక్కులు చూడకు రామయ్య,  జువ్వా చిత్రాలను తెరకెక్కించిన నాకు దర్శకుడిగా ఇది మూడో చిత్రం.  ‘మగధీర’ షూటింగ్ టైమ్‌‌‌‌‌‌‌‌ నుంచి దేవ్ గిల్‌‌‌‌‌‌‌‌ నాకు బాగా పరిచయం.  నేను ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి పనిచేస్తున్న సమయంలో తను హీరోగా ఓ సినిమా చేసే ప్రపోజల్‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చాడు. 

విలన్ ఇమేజ్‌‌‌‌‌‌‌‌ ఉన్న తనతో సినిమా అంటే ఫ్యామిలీ,  ఎమోషన్ లాంటి జానర్స్ వర్కవుట్ అవవని, పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రతో సినిమా చేయాలనుకున్నాం. ఓ విలన్ హీరోగా మారితే ఎలా ఉంటుంది అనేది కథ.  తెలుగు రాష్ట్రాల నుంచి పుణెకు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ అయిన పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇందులో దేవ్ గిల్ కనిపిస్తాడు. అలా ఈ కథను హిందీ, మరాఠీ, తెలుగు ప్రాంతాల వారికి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించాం. హీరోయిన్‌‌‌‌‌‌‌‌ చిత్రా శుక్లాని లెక్చరర్ పాత్రలో చూస్తారు. యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా వచ్చాయి. రియల్ సతీష్ ఫైట్స్ బాగా కంపోజ్ చేశారు. ‘కేజీఎఫ్‌‌‌‌‌‌‌‌’ ఫేమ్ రవి బ్రసూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చారు.  చక్కని కమర్షియల్‌‌‌‌‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’ అన్నారు.