10 అడుగుల దూరం నుంచే AI మీ మాటలు వింటోంది : ఇదే నిజం అయితే ఫోన్ వాడే అందరూ డేంజర్ లో ఉన్నట్లే..!

10 అడుగుల దూరం నుంచే AI మీ మాటలు వింటోంది : ఇదే నిజం అయితే ఫోన్ వాడే అందరూ డేంజర్ లో ఉన్నట్లే..!

ఫోన్ ట్యాపింగులు, స్పైవేర్‌లను ఇక మర్చిపోండి. శాస్త్రవేత్తలు ఇప్పుడు మీ ఫోన్ ముట్టుకోకుండానే మీరు మాట్లాడే మాటలను వినడానికి  ఒక మార్గాన్ని కనిపెట్టారు. రాడార్, కృత్రిమ మేధస్సు ఉపయోగించి శాస్త్రవేత్తలు మీ ఫోన్ ఇయర్‌పీస్ నుండి వచ్చే చిన్న వైబ్రేషన్‌లను తీసుకొని వాటిని పదాలుగా మార్చగలిగారు.

ఇది ఇంకా పూర్తి కాలేదు, కానీ మన ప్రైవేట్ చాట్స్ ఎంత సురక్షితంగా ఉన్నాయో అనే దానిపై  పెద్ద ప్రశ్నలను లేవనెత్తింది.

పెన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మీ ఫోన్ స్పీకర్ నుండి వచ్చే శబ్దం వల్ల కలిగే మైక్రో వైబ్రేషన్స్ గుర్తించడానికి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు & 5Gలో ఉపయోగించే అదే టెక్నాలజీతో మిల్లీమీటర్-వేవ్ రాడార్‌ను ఉపయోగించారు. ఈ వైబ్రేషన్స్ ని టెక్స్ట్‌గా మారుస్తూ AI రంగంలోకి దిగింది.

పరీక్షలలో, వారు 3 మీటర్ల (10 అడుగులు) దూరం నుండి దాదాపు 60% సంభాషణలను ఖచ్చితంగా సంగ్రహించగలిగారు. సున్నితమైన సమాచారం లీక్ అయ్యే ప్రమాదం ఉంది.

ఇదుకు మీ ఫోన్‌ను హ్యాక్ చేయడం లేదా స్పైవేర్‌ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా కాంటాక్ట్‌లెస్, దీనిని గుర్తించడం కూడా కష్టం. ఒకవేళ దీనిని దుర్వినియోగం చేస్తే మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.

మెల్లిమెల్లిగా ఈ ప్రయత్నాలు ఇంకా సక్సెస్ కావొచ్చు  అలాగే ఇదోగా పెద్ద ముప్పుగా కూడా మారుతుంది. కొందరు చెడు ఆలోచనతో  బ్లాక్‌మెయిల్ చేసేందుకు దీనిని దుర్వినియోగం చేయవచ్చు.ప్రస్తుతం, ఇది కొన్ని పరిమితులతో కూడిన ప్రయత్నం మాత్రమే. కానీ ఖచ్చితత్వం మెరుగుపడి టెక్నాలజీ  మరింత అందుబాటులోకి వస్తే, ఫోన్ ప్రైవసీ గురించి మనం ఆలోచించే విధానాన్ని మార్చగలదు.