ముగిసిన ఏఐ డేస్ 2024 కాన్ఫరెన్స్

ముగిసిన ఏఐ డేస్ 2024 కాన్ఫరెన్స్

హైదరాబాద్, వెలుగు: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్)పై హైదరాబాద్‌‌లో జరుగుతున్న  'ఏఐ డేస్ 2024' కాన్ఫరెన్స్‌‌ ఆదివారం ముగిసింది. ఏఐ4సొసైటీ' థీమ్‌‌తో ఈ రెండు రోజుల కాన్ఫరెన్స్‌‌ను ఎన్‌‌జీఓ స్వేచ్చ నిర్వహించింది. ఈ ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వం  ఐటీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ హాజరయ్యారు.

కంప్యూటర్ సైంటిస్ట్, ఇంజనీర్ డాక్టర్ కృష్ణ పాలెం, స్వేచ్చ వ్యవస్థాపకుడు వై కిరణ్ చంద్ర, స్వేచ్చ కార్యదర్శి ప్రవీణ్ చంద్ర పాల్గొన్నారు. ఈ సదస్సులో రెండు వేల మందికి పైగా ఐటీ నిపుణులు, పరిశోధకులు, స్టార్టప్‌‌లు, విద్యార్థులతో పాటు టెక్ కంపెనీల ఏఐ, ఎంఎల్ నిపుణులు హాజరయ్యారు.