ఉద్యోగాలపై AI ప్రభావం: 62 శాతం ఉద్యోగులు జాబ్స్ పోతాయని భయపడుతున్నారు

ఉద్యోగాలపై AI ప్రభావం: 62 శాతం ఉద్యోగులు జాబ్స్ పోతాయని భయపడుతున్నారు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం ఐటీ ఉద్యోగులపై పడుతోంది.ఈ చేదు నిజాన్ని సర్వేలు చెబుతున్నారు. రాబోయే ఐదేళ్లలో AI ప్రభావం తమ ఉద్యోగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నట్లు సర్వేల్లో తేలింది. AI టెక్నాలజీ లేకపోతే తన పని కొనసాగించలేమని.. 62 శాతం భారతీయ ఉద్యోగులు తమ ఉద్యోగాలు చేయడానికి అవసరమైన నైపుణ్యాలు రాబోయే ఐదేళ్లలో గణనీయంగా మారుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

AI టెక్నాలజీ వినియోగం, దాని ప్రభావం.. ఇండియాలో కంపెనీలు ఎలా AI ని వినియోగించుకుంటాయి.. ఉద్యోగాలపై దాని ప్రభావం వంటి అంశాలపై  ఇండియన్ వర్క్ ఫోర్స్ హోప్స్ అండ్ ఫియర్స్ సర్వే 2023 పేరుతో PWC సర్వే నిర్వహించింది.ఈ సర్వేలో రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 31 శాతం మంది ఉద్యోగులు ఏఐతో నే తమ పనుల్లో ఉత్పాదకత పెరిగిందనిచెప్పారు. ఇండియాలో 51 శాతం మంది ఉద్యోగులు ఏఐ పై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే రాబో యే రోజుల్లో తమ ఉద్యోగాలపై AI ప్రభావం చాలా ఉంటుందని.. కంపెనీలు స్కిల్స్ పెంచుకునేందుకు అవకాశం ఇస్తాయని నమ్ముతున్నామని 62 శాతం భారతీయ ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు. 

PWC నివేదిక ప్రకారం.. రాబోయే ఐదేళ్లలలో తమ ఉద్యోగాలపై ఖచ్చితంగా AI ప్రభావం ఉంటుందని..వేతన ప్యాకేజీలు, ప్రమోషన్ల విషయంలో హెచ్చుతగ్గులు ఉంటాయని.. వచ్చే ఏడాది తమ ఉద్యోగాల్లో మార్పు భారీగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. 
సంస్థాగత నిర్వహణలో భాగంగా కంపెనీలు యువతరం పై దృష్టి సారిస్తున్నాయి..అయితే సీనియర్ ఎగ్జిక్యూటివ్ లను ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని సర్వేల్లో తేలింది.