
చెన్నై: అన్నాడీఎంకే నేత, మాజీ సీఎం ఓ.పన్నీర్ సెల్వంకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. పార్టీలో జూన్ 23 కంటే ముందున్న స్థితి(స్టేటస్ కో)ని కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. అన్నాడీఎంకేలో ద్వంద్వ నాయకత్వ విధానాన్ని కొనసాగించాలని చెప్పింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళని స్వామి ఎన్నిక చెల్లదని పేర్కొంది. కోఆర్డినేటర్, జాయింట్ కోఆర్డినేటర్ అనుమతి లేకుండా అన్నాడీఎంకే సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించడాన్ని తప్పుబట్టింది. సమావేశాన్ని మళ్లీ నిర్వహించాలని జస్టిస్ జి.జయచంద్రన్ ఆదేశించారు.
జులై 11న జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ మీటింగ్‌లో పళనిస్వామి వర్గం నేతలు.. పన్నీర్ సెల్వంను పార్టీ పదవుల నుంచి తొలగిస్తున్నట్లు తీర్మానించారు. దీనిపై పన్నీర్ సెల్వం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా.. పార్టీలో ద్వంద్వ నాయకత్వం కొనసాగించాలని కోర్టు ఆదేశించింది.