
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో డిస్ట్రిక్ కాంగ్రెస్ కమిటీ డీసీసీ) అభ్యర్థుల ఎంపికలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టామని.. ఆ అభ్యర్థుల ఎంపిక కోసం ఆదివారం నుంచి ఏఐసీసీ అబ్జర్వర్స్ జిల్లాల్లో పర్యటిస్తున్నారని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. ఏఐసీసీ అబ్జర్వర్స్ లో మాజీ సీఎం నారాయణస్వామి, కేంద్ర మాజీ మంత్రి సీపీ జోషి, సీడబ్ల్యూసీ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఉన్నారని పేర్కొన్నారు.
వీరి పర్యవేక్షణలో జిల్లాల్లో డీసీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సజావుగా సాగుతున్నదని సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. డీసీసీ పదవులు ఆశిస్తున్న జిల్లాల సీనియర్ నేతలు ఏఐసీసీ అబ్జర్వర్స్ని కలిసి అప్లికేషన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నానని తెలిపారు.