చిన్నారులపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ షురూ

చిన్నారులపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ షురూ

న్యూఢిల్లీ: కరోనా థర్డ్ వేవ్‌తో పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలకు కూడా వ్యాక్సిన్‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రీసెర్చర్స్ శ్రమిస్తున్నారు. తాజాగా దేశ రాజధానిలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఈ దిశగా అడుగులు పడ్డాయి. 6 నుంచి 12 ఏళ్ల వయస్సు కలిగిన చిన్నారులపై కొవాగ్జిన్ ట్రయల్స్‌ కోసం సెలెక్షన్ ప్రక్రియను మొదలుపెట్టామని ఎయిమ్స్‌లోని సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడిసిన్‌లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సంజయ్ రాయ్ తెలిపారు. క్లినికల్ ట్రయల్స్ కోసం ఇప్పటికే 12 నుంచి 18 ఏళ్ల వయస్సులో ఉన్న పలువురిని ఎంపిక చేశామని.. వీరికి కొవాగ్జిన్ సింగిల్ డోసు ఇచ్చామన్నారు. 6 నుంచి 12 ఏళ్ల వారి ఎంపిక ప్రక్రియ పూర్తయితే 2 నుంచి 6 ఏళ్ల వయస్సు కలిగిన వారికి ట్రయల్స్ నిర్వహించే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.