టెక్స్​టైల్స్​ ఎగుమతులను పెంచడమే టార్గెట్​ : పీయూష్​ గోయెల్

టెక్స్​టైల్స్​ ఎగుమతులను పెంచడమే టార్గెట్​ : పీయూష్​ గోయెల్

న్యూఢిల్లీ : రాబోయే అయిదారేళ్లలో మన టెక్స్​టైల్స్​ ఎగుమతులను 100 బిలియన్​ డాలర్ల (రూ.8.2 లక్షల కోట్ల) కు పెంచాలని టార్గెట్​గా పెట్టుకున్నట్లు కేంద్ర టెక్స్​టైల్స్​ శాఖ మంత్రి పీయూష్​ గోయెల్​ వెల్లడించారు. అప్పటికి మన టెక్స్​టైల్స్​ ఇండస్ట్రీ విలువ (దేశీయ, అంతర్జాతీయ) 250 బిలియన్​ డాలర్లవుతుందని ఆయన చెప్పారు. 2021–22 లో దేశం నుంచి టెక్స్​టైల్స్​ ఎగుమతులు 42 బిలియన్​ డాలర్ల (రూ.3.44 లక్షల కోట్ల) ని పేర్కొన్నారు. ఎక్స్​పోర్ట్​ ప్రమోషన్​ కౌన్సిల్‌ మెంబర్లను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్​లో పీయూష్​ గోయెల్​ మాట్లాడారు. తమ అవసరాలకు సరిపడేలా కాటన్​ కొనుగోలు చేయడానికి టెక్స్​టైల్స్​ తయారీదారులు రెడీ కావాలని ఆయన సూచించారు. కాటన్​ సేకరణకు తగిన స్ట్రాటజీ రూపొందించేందుకు కాటన్​ ఇండస్ట్రీ ప్రతినిధులందరూ కలిసి కూర్చుని మాట్లాడుకోవాల్సిందిగా పిలుపు ఇచ్చారు. కాటన్​ ప్రొడక్టులకు సరయిన విలువ వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన హితవు చెప్పారు.

కిందటేడాది మన టెక్స్​టైల్స్​ ఎగుమతులు 42 బిలియన్​ డాలర్లని, రాబోయే అయిదారేళ్లలో వాటిని 100 బిలియన్​ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి పేర్కొన్నారు. 2022–23 క్రాప్​ ఇయర్​లో పత్తి ప్రొడక్షన్​ 34.19 మిలియన్​ బేళ్లుగా ఉంటుందని అగ్రికల్చర్​ మినిస్ట్రీ డేటా అంచనా వేస్తోంది. అంతకు ముందు ఏడాది ఇది 31.20 మిలియన్​ బేళ్లు (ఒక బేలుకు 170 కేజీలు).మన దేశంలో పత్తి పంట ప్రధానమైన ఖరీఫ్​ పంటగా ఉంది. పత్తి హార్వెస్టింగ్​ అక్టోబర్​ నుంచి మొదలవుతుంది. టెక్స్​టైల్​ మిషన్​ కింద అందుబాటులో ఉన్న ఫండ్స్​ను కొత్త ప్రాజెక్టులకు వాడుకోవాలని పీయూష్​ గోయెల్​ చెప్పారు. జీ–20 లో మన టెక్స్​టైల్స్​ సెక్టార్​ సామర్ధ్యాన్ని షోకేస్​ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. షాపింగ్​ ఫెస్టివల్స్​లో భాగం పంచుకోవాలనే ఫైనాన్స్​ మినిస్టర్​ ప్రపోజల్​ను కూడా పరిశీలించాల్సిందిగా పరిశ్రమ ప్రతినిధులను మంత్రి కోరారు. మినిస్ట్రీ ఆఫ్​ టెక్స్​టైల్స్​ కింద ఉన్న 11 ఎక్స్​పోర్ట్ ప్రమోషన్​ కౌన్సిల్‌ ​ మెంబర్లకూ కలిపి ఈ వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఇండస్ట్రీ అసోసియేషన్ల ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొన్నారు. టెక్స్​టైల్స్​ సెక్టార్​ను పటిష్టం చేసేందుకు రెండు రోజుల మీటింగ్​ నిర్వహించాల్సిందిగా పీయూష్​ గోయెల్​ తెలిపారు. ఇందులో కనీసం 50 % మంది యువత ఉండేలా చొరవ తీసుకోవాలని, డీపీఐఐటీ, ఫైనాన్స్– బ్యాంకింగ్‌ వంటివి ఉండాలన్నారు.