సీఏఏకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో ముస్లీంల ర్యాలీ

సీఏఏకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో ముస్లీంల ర్యాలీ

సీఏఏ,ఎన్ఆర్ సీ, ఎన్పీఆర్ కి వ్యతిరేకంగా కు హైదరాబాద్ లో ముస్లీంలు తిరంగ ర్యాలీ నిర్వహించారు.  ముస్లీం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. ముస్లీం యువత, మహిళలు జాతీయ జెండాలతో నిరసన తెలిపారు .ఈ ర్యాలీకి ఎంఐఎం సపోర్టర్స్ భారీగా తరలివచ్చారు. మిరాలం మండీ నుంచి శాస్త్రీ పురం వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. ర్యాలీకి పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.