ఎయిర్‌‌‌‌ డెక్కన్ ఆపరేషన్స్ క్లోజ్

ఎయిర్‌‌‌‌ డెక్కన్ ఆపరేషన్స్ క్లోజ్
  • కరోనా కాటుకు గురైన తొలి ఏవియేషన్ ఇదే

రీజనల్ క్యారియర్ఎయిర్‌ డెక్కన్ తన ఆపరేషన్స్‌‌ను రద్దు చేసింది. తదుపరి నోటీసులు వచ్చేంత వరకు ఎలాంటి ఆపరేషన్స్ సాగవని పేర్కొంది. ఉద్యోగులందరకీ ఎలాంటి వేతనాలు ఉండవని చెప్పింది. కరోనా వైరస్ దెబ్బకు అన్ని ఆపరేషన్స్‌ ను మూసుకుని జీతాలు ఇవ్వని తొలి ఏవియేషన్ కంపెనీగా ఎయిర్ డెక్కన్ నిలిచింది. గ్లోబల్‌గా, దేశీయంగా ఇటీవల చోటు చేసుకున్న పరిణామలు, ఈ నెల 14 వరకు అన్ని కమర్షియల్ ప్యాసెంజర్ ఫ్లయిట్స్‌ ను మూసివేయాలని ఇండియన్ రెగ్యులేటర్ జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో ఎయిర్‌‌‌‌డెక్కన్‌ తన ఆపరేషన్స్‌ను రద్దు చేస్తున్నట్టు ఎయిర్‌ డెక్కన్ సీఈవో అరుణ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. తమ వద్ద ఇక ఎలాంటి ఆప్షన్ లేదన్నారు. పర్మినెంట్ , టెంపరరీ ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించలేమన్నారు.