ఎయిర్ ఇండియా ప్రమాదం..మృతదేహాలు తారుమారయ్యాయ్..ఆందోళనలో యూకే బాధిత కుటుంబాలు

ఎయిర్ ఇండియా ప్రమాదం..మృతదేహాలు తారుమారయ్యాయ్..ఆందోళనలో యూకే బాధిత కుటుంబాలు

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా  విమాన ప్రమాదంలో మృతిచెందిన వారి మృతదేహాలు  తారుమారయ్యాయనే వార్తలు తీవ్ర కలకలం రేపాయి. యూకే మృతుల కుటుంబాలకు పంపించిన మృతదేహాలు తారుమారు అయినట్లు తెలుస్తోంది. దీంతో బాధితుల్లో ఒకరి బంధువులు అంత్యక్రియలను రద్దు చేసుకున్నారు. మరో కేసులో ఇద్దరు బాధితుల మృతదేహాలను ఒకే శవపేటికలో ఉంచినట్లు UK మీడియా హౌస్ చెబుతోంది.

బ్రిటిష్ మృతుల DNA లను వారి కుటుంబాలు నమూనాలతో సరిపోల్చడం ద్వారా గుర్తించేందుకు ఇన్నర్ వెస్ట్ లండన్ కరోనర్ డాక్టర్ ఫియోనా విల్కాక్స్ యత్నించగా ఈ విషయం బయటపడింది.ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరుగుతోంది. రిపోర్టుల  ప్రకారం.. యుకె ప్రధానమంత్రి ఈ విషయాన్ని ప్రధాని మోదీతో లేవనెత్తే అవకాశం ఉంది.

ALSO READ | ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం..అత్యవసరం ల్యాండింగ్

ప్రమాదంలో మృతిచెందిన UK పౌరుల్లో చాలా మందికి అంత్యక్రియలు భారతదేశంలోనే నిర్వహించారు. అయితే 12 మృతదేహాలను UKకి పంపించారు. ఇక్కడే ప్రధాన సమస్య తలెత్తింది.

UKకి పంపిన మృతదేహాలలో కొన్ని తప్పుగా బదిలీ అయ్యాయని..బాధితుల కుటుంబాలకు వారి ఆత్మీయుల మృతదేహాలకు బదులు ఇతరుల మృతదేహాలు అందాయని వార్తలు వచ్చాయి. దీనివల్ల బాధితుల కుటుంబాలు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాయి. అంత్యక్రియల ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఇతరుల మృతదేహాలు అందినట్లు తెలియడంతో వారు దుఖంలో మునిగిపోయారు. 

టా టా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ఈ ఘటనలో మరణించిన ప్రతి కుటుంబానికి రూ. 1 కోటి పరిహారంగా ప్రకటించింది. అంతేకాకుండా తక్షణ అవసరాల నిమిత్తం రూ. 25 లక్షల అదనపు తాత్కాలిక పరిహారం కూడా అందజేసింది. ఈ  ఘటన విమానయాన చరిత్రలో ఒక విషాదకర అధ్యాయంగా మిగిలిపోయింది. ఇది మృతదేహాల గుర్తింపు, బదిలీ ప్రక్రియలలో మరింత కచ్చితత్వం, సున్నితత్వం అవసరాన్ని గుర్తుచేస్తుంది.