బ్రేకింగ్: కోజికోడ్‌లో విమాన ప్రమాదం.. ఇద్దరు మృతి

బ్రేకింగ్: కోజికోడ్‌లో విమాన ప్రమాదం.. ఇద్దరు మృతి

కోజికోడ్: కేరళలోని కోజికోడ్‌లో శుక్రవారం సాయంత్రం విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు చనిపోగా, 40 మంది గాయాలపాలైనట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదానికి గురైన సదరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఫ్లయిట్‌లో 191 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్లయిట్ ల్యాండ్ అవ్వడానికి కొద్దిసేపు ముందు ఈ యాక్సిడెంట్ జరిగిందని తెలిసింది. రన్‌వేను ఢీకొన్న వెంటనే ఎయిర్‌‌క్రాఫ్ట్‌ కొన్ని ముక్కలుగా తెగిపడింది. కేరళలో ఎడతెరపి లేని వర్షాల కారణంగా సుమారు ఈ రోజు రాత్రి 7.40 గంటల ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకుందని సమాచారం. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.