రన్వే పై ల్యాండ్ అవుతూ పక్కకు జారి పోయిన విమానం.. ముంబై ఎయిర్ పోర్టులో తప్పిన పెను ప్రమాదం

రన్వే పై ల్యాండ్ అవుతూ పక్కకు జారి పోయిన విమానం.. ముంబై ఎయిర్ పోర్టులో తప్పిన పెను ప్రమాదం

ఎయిర్ ఇండియా విమానాలకు వరుస ప్రమాదాలు ఎదురవుతూనే ఉన్నాయి. అహ్మదాబాద్ ఘో ప్రమాదం తర్వాత ఏదో ఒక టెక్నికల్ సమస్యతో ఎయిర్ ఇండియా చర్చల్లో ఉంటూనే ఉంది. లేటెస్ట్ గా సోమవారం (జులై 21) మరో మరో ఎయిర్ ఇండియా విమానం ముంబై ఎయిర్ పోర్టులో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది.

కొచ్చి నుంచి ముంబయి వెళ్లిన ఎయిరిండియా విమానం ముంబయి ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతున్న సమయంలో రన్‌వేపై అదుపు తప్పింది. రన్ వేపై చక్రాలు జారి పోవటంతో పెద్ద ప్రమాదం జరుగుతుందని ఆందోళన చెందారు పైలట్లు. ముంబయిలో కురుస్తున్న వర్షాల కారణంగా విమానం రన్ వే పై జారిపోయి అదుపుతప్పి పక్కకు జరిగింది. దీంతో విమానం వెనక భాగంలో గడ్డి ఇరుక్కుపోయింది. ఒక ఇంజిన్ డ్యామేజ్ అయినట్లు అధికారులు తెలిపారు. 

విమానం స్కిడ్ అవ్వడంతో రన్ వే కూడా డ్యామేజ్ అయినట్లు ఎయిర్ పోర్ట్ అథారిటీ ప్రకటించింది. విమానం పక్కకు జారిపోయిన ప్రమాదాన్ని వెంటనే గమనించిన అధికారులు.. ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా దింపినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో విమాన ఇంజిన్‌, మూడు టైర్లు దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రైమరీ రన్‌వే కూడా కొంతమేర ధ్వంసమైనట్లు తెలుస్తోంది. దీంతో ఇతర విమానాల ల్యాండింగ్‌ కోసం సెకండరీ రన్‌వేను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. 

ALSO READ : కాలేజీలోకి దూసుకొచ్చి.. పేలిపోయిన జెట్ విమానం

కొచ్చి నుంచి ముంబయికి చేరుకున్న AI2744 విమానాన్ని ల్యాండ్‌ చేస్తున్న సమయంలో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. భారీ వర్షం కారణంగానే టైర్లు స్కిడ్ అయ్యిఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. తనిఖీల కోసంవిమానాన్ని వేరే ప్రదేశానికి తరలించినట్లు  ఎయిరిండియా ప్రకటించింది.

గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ముంబై రన్ వే పై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో ప్యాసెంజర్లు.. బుక్ చేసుకున్న ఫ్లైట్ కు సంబంధించి కండిషన్, టైమ్ అప్డేట్స్ గురించి పలుమార్లు కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి తెలుసుకోవాల్సిందిగా ముంబై ఎయిర్ పోర్ట్ అధికారులు సూచించారు.