ఢిల్లీలో వెరీ పూర్ కేటగిరిలోనే ఎయిర్ క్వాలిటీ

ఢిల్లీలో వెరీ పూర్ కేటగిరిలోనే ఎయిర్ క్వాలిటీ

దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇంకా వెరీ పూర్ కేటగిరిలోనే కంటిన్యూ అవుతుంది. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరం అయింది. ఉదయం దట్టమైన పొగ మంచు ఢిల్లీని కమ్మేసింది. ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 303గా నమోదైంది. రెండు రోజుల క్రితం పూర్ కేటగిరీలో ఉండగా ఇవాళ మరోసారి ఎయిర్ క్వాలిటీ దిగజారిపోయింది. 

కొన్ని రోజుల నుంచి వాయు కాలుష్యం స్థాయిలు తగ్గుముఖం పట్టడంతో ఈరోజు పరిస్థితి సమీక్షించనున్నట్లు ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ కమిషన్ తెలిపింది.  ప్రస్తుతం ఢిల్లీలో AQI 303గా నమోదవ్వగా....ధీర్ పూర్ లో 280గా రికార్డ్ అయింది. యూపీలోని నోయిడాలో 327గా నమోదైంది. అలాగే గురుగ్రామ్ లో AQI 239కు చేరుకుంది.